గత పదేళ్ళలో బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటి..?

1

మొదటిదశ ఓటింగుతో మోడీ వెన్నులో వణుకు…
. గత పదేళ్ళలో బీజేపీ చేసిందేంటి..
. మోడీ ఫోటో కాదు.. రాముడు పేరుతో ఓట్లు అడుగుతున్నారు
. బలహీన వర్గాలు హిందువులు కాదా..?
. కాంగ్రెస్ తో అన్ని వర్గాలకు సమ న్యాయం..
. కరీంనగర్ సీటు గెలుపు ఖాయం
. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
కరీంనగర్:
దేశంలో మొదటి దశలో జరిగిన ఓటింగ్ తో మోడీ వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే కాంగ్రెస్ పార్టీపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పార్టీ పెద్దల సూచన మేరకు పార్టీ నాయకత్వం ఏకగ్రీవంగా వెలిచాల రాజేందర్ నామినేషన్ లో పాల్గొన్నామన్నారు. రేపు పార్టీ అభ్యర్థి అధికారిక ప్రకటన వస్తుందన్నారు. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో లేదన్నారు. దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంపద నేరుగా ముస్లిం లకు పంచుతారని మోడీ చెప్తున్నాడనన్నారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ లో దేశ వ్యాప్తంగా కుల గణన చేస్తామని చెప్పిందన్నారు. కుల గణన జరిగితే ఎస్సి, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని భావించిందన్నారు. దేశ ప్రజలకు న్యాయకత్వం వహించాల్సిన వ్యక్తి దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీని పై సుప్రీం కోర్టు సుమోట గా స్వీకరించాలని, విచారించాలని కోరుతున్నా అన్నారు. ఈ అంశంపై కరీంనగర్ లోక్ సభ ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ 50-60 సంవత్సరాలు దేశంలో పాలించిందని, దేశంలో ఏ మతస్థులకు కూడా అన్యాయం జరిగేలా వ్యవహరించలేదన్నారు. అన్నీ వర్గాలకు న్యాయం జరిగే ప్రయత్నం చేసిందన్నారు. 85 శాతం ఉన్న హిందువులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా..? వారికి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం తీసుకుందా..? మోడీని ఆడిగారు. దేశంలో ఉన్న ప్రజలకు హిందువులకు మరింత మేలు జరుగుతుందని, మరింత మార్పు జరుగుతుందని నమ్మి 30 సంవత్సరాల తరువాత ఎవరి సహకార లేకుండ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే మెజారిటీ బీజేపీ కి ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు.
నేను కూడా హిందువునే…
ఈ దేశంలో ఉన్న హిందువులకు ప్రత్యేకంగా మీరు తీసుకున్న నిర్ణయం ఎంటి..? ప్రత్యేకించి హిందువుల రక్షణ, హిందువులకు ఇచ్చిన ఆర్థిక, రాజకీయ, సామాజికంగా సమాజంలో వారికి ఏం భాగస్వామ్యం ఇచ్చారని అడిగారు. దేశంలో దళిత, బడుగు బలహీన వర్గాలకు దేశ జన గణన జరగాలని ఏం ఇచ్చారన్నారు. 2010లో జన గణన బయటపెట్టాలని డిమాండ్ చేస్తే సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి బలహీన వర్గాలకు అన్యాయం చేసింది బీజేపీ కాదా..? అన్నారు.
బలహీన వర్గాలు హిందువులు కాదా..?
బిజెపి వ్యాపారస్తుల పార్టీ అని, పేదల, దళితుల, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేక పార్టీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐఐటి, ఐఐఎంలో చదువుకున్న వందల మంది హిందువులు ఈ ప్రపంచంలోనే ఉన్నారన్నారు. గత 3 నెలలుగా నరేంద్ర మోడీ ఫోటోలు లేవని, ఇంటింటికీ నరేంద్ర మోడీ ఫోటోలు చూపెట్టి ఓట్లు అడగడం లేదని, ఇంటింటికీ రాముడి ఫోటోలు చూపెట్టి.. గోడలకి రాముడి పేర్లు రాసి అక్షింతలు పంచుతూ ఓట్లు అడుగుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, కచ్చితంగా ఆలోచన చేస్తారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా అన్ని వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్సే అన్నారు. మన్మోహన్ సింగ్ గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలని మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. దేశ సార్వభౌమత్వానికి సంబంధించి దేశ ఐక్యతకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగారం దోచుకుంటామని ప్రధాని అన్యాయంగా మాట్లాడుతున్నారని, విశ్వ గురువు అంటే ప్రధానికి సిగ్గు అనిపించడం లేదా అన్నారు.
హిందువులకు కూడా ఉద్యోగాలు కావాలి…
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదన్నారు. 15 శాతం మైనర్టీలను పక్కకు పెడితే కోటి 70 లక్షల భాగం హిందువులదే కదా.. .వారి పేరు చెప్పి హిందువులను ఎందుకు కొడుతున్నావన్నారు. ఉపాధి అవకాశాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు ఏం ఇచ్చావు..వారు కూడా హిందువులే కదా..అని అడిగారు.
రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందేవరు…
దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వందలాది మంది రైతులకు చనిపోవడానికి కారణం మీరు కదా..అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 22 పంటలకు గిట్టుబాటు ఇస్తే మీరు 23 వ పంటకు ఎందుకు ఇవ్వలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఏం చేశారన్నారు. నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని గా వ్యవహరించాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ లీడర్, మానవతావాది.. మోడీ నియంతృత్వ వాది..విద్వేషాలు మధ్య దేశంలో వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దన్నారు. కరీంనగర్ సీటు గెలవబోతున్నమని తెలిపారు. బీజేపీ , బిఆర్ఎస్ లలో ఉన్న ప్రజాస్వామ్య వాదులు కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

1 thought on “గత పదేళ్ళలో బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటి..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *