నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం చేయాలి

నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలి
. కళాశాలల్లో ఎన్నికల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
. జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి

కరీంనగర్:
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటేసేలా అవగాహన కల్పించాలని, విస్తృత ప్రచారం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జూనియర్ కళాశాల అధ్యాపకులకు మరియు విద్యార్థులకు కలిపి ఓటరు అవగాహన కోసం నిర్వహించిన ప్రత్యేక వర్క్ షాప్, స్వీప్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి పాల్గోన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారత ఎన్నికల సంఘం సూచించిన మేరకు ఓటు ప్రధాన్యత పట్ల తల్లి తండ్రులు మరియు కుటుంబ సభ్యులు, ప్రజలకు వివరించి, ప్రతిఓక్కరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండ నిర్బయంగా స్వేచ్చగా నవంబర్ 30న జరిగే పోలింగ్ లో ఓటుహక్కును వినియోగించుకోవాలని తెలిపారు. చదువుతో పాటు ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగి ఉండాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా గుర్తించబడి, భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటును సద్వినియోగం చేసుకోలేనప్పుడు, ప్రశ్నించే హక్కును కొల్పోతామని పేర్కోన్నారు. ఈ కార్యక్రమం తరువాత విద్యార్థులందరు మరికొంత మందికి ఓటు హక్కును గురించి వివరించాలని కోరారు. భవిష్యత్తులో ఓటు హక్కు పొందే విద్యార్థులు తర్వాతి ఎన్నికలలో మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి దోహదపడతారని, అంతేకాకుండా ప్రస్తుత ఎన్నికలో ఓటింగ్ శాతం పెంచడానికి తోడ్పడుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 100 కళాశాలకు సంబందించిన అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి రామాచారి, జిల్లా ఇంటర్ మీడియట్ విద్యాశాఖ అధికారి జగన్ హహన్ రెడ్డి, అసిస్టెంట్ స్వీప్ నోడల్ అధికారి రవీందర్ తదితరులు పాల్గోన్నారు.