పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి

3

రిజర్వేషన్లు ఎత్తేసినందుకు బిజెపి కుట్ర..
. బిఆర్ఎస్ బిజెపి చీకటి ఒప్పందం..
. బిజెపిని ఓడించే బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది
. కెసిఆర్ ను ఇండియా కూటమిలోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వం..
. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిండు మోడీ…
. ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం..
. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
. జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్:
దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బిజెపి కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేంద్రంలో జరిగిన జన జాతర సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా చాలా చైతన్యవంతమైనదని ఎంతోమంది ఉద్యమకారులను అందించిందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాకే చాలా ముఖ్యమైన చరిత్ర ఉందన్నారు చింతమడక నుంచి వచ్చిన కెసిఆర్ కు అండగా నిలిచి తెలంగాణ ఉద్యమానికి ఈ జిల్లా ఊపిరి అందించిందన్నారు. ఉప ఎన్నికలు వచ్చినా చంద్ర శేఖర్ రావు కు అండగా నిలబడ్డారని, అలాంటి కరీంనగర్ ను కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసి, మిమ్మల్ని వదిలి పాలమూరు కు వస్తే కూడా ఉద్యమాన్ని నీరు గార్చవద్దని కేసిఆర్ ను ఎంపి గా గెలిపించామని గుర్తు చేశారు. సెమీ ఫైనల్స్ లో చంద్రశేఖర్ రావు కు కర్రు కాల్చి వాత పెట్టి చిత్తు చిత్తుగా ఓడించారని, రాబోయే ఫైనల్స్ లో పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీ అయినా బిజెపికి బుద్ధి చెప్పి నరేంద్ర మోడీనీ కూడా చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉందన్నారు.
విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదు….
తెలంగాణ విభజన హామీలను బిజెపి ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. తెలంగాణకు రావలసిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరి, ఐఐఎం, ఐఐటి తెలంగాణ కు ఇవ్వాల్సి ఉండే కానీ తెలంగాణ కు నరేంద్ర మోడీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షలను అవమానపరిచే విధంగా పార్లమెంటులో నరేంద్రమోడీ 1600 మంది తెలంగాణ అమరులను, తెలంగాణ తల్లినీ పార్లమెంట్ లో అవమాన పరిచినప్పుడు పార్లమెంట్ లో ఉన్న బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదు సంవత్సరాలలో ఏటా ఐదు కోట్ల రూపాయల చొప్పున 25 కోట్ల రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి గాడిది గుడ్డును మాత్రమే తీసుకొచ్చారని విమర్శించారు. బిజెపి మాయమాటలతో వంచించి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
శ్రీరామున్ని అవమానపరిచిన బిజెపి…
హిందుత్వాన్ని ఓట్ల కోసం బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని మండిపడ్డారు. చిల్లర పైసలు అడుక్కున్నట్లు దేవుడి ఫోటో చూపించి వోట్లు అడుక్కుంటున్నారన్నారు. దేవుడు గుడిలో ఉండాలి…భక్తి గుండెల్లో ఉండాలి అంతేకానీ రాముని పేరు చెప్పుకొని హిందూ సాంప్రదాయానికి మాయని మచ్చలు వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. అయోధ్య రామాలయం పూర్తికాకముందే రాములోరి అక్షింతలను 15 రోజుల ముందు పంపిణీ చేసి హిందూ సాంప్రదాయాలను మంటగలిపిన ఘన చరిత్ర ప్రధాని మోడీకే దక్కుతుందని దుయ్యబట్టారు. బిజెపి ప్రభుత్వం మతం పేరుతో అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాక్షస ఆనందం పొందుతున్నారని, రాముని తామే దేశ ప్రజలకు దేవునిగా పరిచయం చేసినట్లు డబ్బాలు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామ దేవతలు మొదలుకొని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి దేవునికి మొక్కుతూ మన హిందూ సాంప్రదాయాన్ని అనాదిగా కాపాడుకుంటూ వస్తుంటే బిజెపి వాళ్లు మాత్రం దేశ ప్రజలకు మేమే హిందుత్వం గురించి నేర్పినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మతం పేరుతో ఎన్నికల్లో ప్రచారం కొనసాగిస్తూ ఓటర్లను మాయ చేస్తున్న గుండు అర గుండు గాళ్లను పక్కకు నెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించి మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
రిజర్వేషన్ ఎత్తేసేందుకు బిజెపి కుట్ర…
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను బిజెపి రద్దు చేసే కుట్రలు చేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయక పక్కన పెట్టారన్నారు. 400 వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరణ చేసేందుకు బిజెపి కుట్రలు చేస్తోందన్నారు. రిజర్వేషన్ లను రద్దు చేసే హక్కు బిజెపి పార్టీకి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడల్నా…గెలవలా.. అన్న నిర్ణయాన్ని ప్రజలే తీసుకోవాలని సూచించారు. నేను రెండు మూడు వేదికల్లో రిజర్వేషన్ ల గురించి మాట్లాడితే నాకు నోటీసు లు ఇచ్చారు. నన్ను గత ప్రభుత్వ హాయంలో కేసిఆర్ జైల్ కు పంపాడని అన్నారు. మరి ఏరోజు ఏమైంది, కార్ కరాబ్ అయిందని, కార్ కరాబ్ ఐతే బస్ వేసుకొని వస్తే తిక్కలోడు తిరునాల్లకు పోయినట్లు ఉందని విమర్శించారు.
బీజేపీ, బిఆర్ఎస్ చీకటి ఒప్పందం…
రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఖమ్మం, నల్గొండ లాంటి సీట్లలో బీజేపీ వాళ్లు బిఆర్ఎస్ కు సపోర్ట్ చేయాలని ఒప్పందం ఉందన్నారు. బిఆర్ఎస్ వాళ్ళతో మా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని, కేసిఆర్ ను ఎట్టి పరిస్థితులలో ఇండియా కూటమిలో రానివ్వమని స్పష్టం చేశారు. దేశంలో సెక్యులరిజాన్ని కాపాడేందుకు సిపిఐ, సిపిఎం, తెలంగాణ జన సమితి పార్టీలు కాంగ్రెస్ తో జతకట్టాయన్నారు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకుందన్నారు. రామప్ప శివుడు సాక్షిగా ఆగస్టు 15 లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రైతుల ఋణ తీర్చుకుంటానన్నారు. రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

3 thoughts on “పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *