తండ్రి విజయం కోసం తనయుడు వ్యూహం

హుస్నాబాద్ లో.. కదిలిన యువ తరంగం..
. తండ్రి సతీష్ విజయం కోసం తనయుడు ఇంద్రనీల్ వ్యూహం
. ప్రతిపక్షాలకు దడ పుట్టిస్తున్న ఇంద్రనీల్..

హుస్నాబాద్:
హుస్నాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ విజయం కోసం.. యువత నడుం కట్టింది. మీవెంటే.. మేమంటూ… యువతరంగం కదిలింది. యువత సతీష్ విజయం కోసం గత మూడు నెలలుగా కదం తొక్కారు.. మేమున్నాం అంటూ అండగా నిలిచారు. యువ ప్రభంజనం వెనుక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తనయుడు ఇంద్రనీల్ కీలక భూమిక పోషించారు. అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసిన ఇంద్రనీల్ తన తండ్రి విజయం కోసం యువతకు మార్గ నిర్దేశం చేసారు. యువతరాన్ని తట్టి లేపారు. నియోజకవర్గం లోని యువత విద్యార్థులు ఇంద్రనీల్ ప్రచారానికి ఫిదా అయిపోయారు. సహజంగానే హీరోలా ఆకట్టుకునే రూపం ఉన్న ఇంద్రనీల్ ఎన్నికల కోసం ఒక సర్వ సైన్యాధ్యక్షుడిలా పనిచేసారు. అన్ని మండలాల్లో యువతతో సమావేశాలు నిర్వహించారు. బూత్ కమిటీల సమావేశాలు గ్రామ గ్రామాన నిర్వహించారు. వారికి మార్గనిర్దేశం చేసారు. నేనున్నా అంటూ తట్టి లేపారు. వ్యూహ ప్రతివ్యూహాలతో.. ప్రతి పక్షాలకు దడ పుట్టించారు.
వెల్లువలా చేరికలు…
ఇంద్రనీల్ పిలుపుతో.. యువత గ్రామాల్లో తండోపతండాలుగా కదిలారు. అన్ని గ్రామాల్లో పర్యటించారు. అక్కడి జనంతో ముచ్చటించారు. వారికీ నేనున్నా అంటూ భరోసా ఇచ్చారు. అక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. యువత పిడికిలి బిగించి జై బీ ఆర్ ఎస్ అనేలా చేసారు. తన తండ్రి సతీష్ బాబు కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇంద్రనీల్ ప్రచారం ఒక హీరో ప్రచారాన్ని తలపించింది. పిల్లల్ని, మహిళల్ని, పెద్దల్ని నవ్వుతూ పలకరిస్తూ.. ముందుకు కదిలారు. ఇంద్రనీల్ వ్యూహంతో.. గులాబీ పార్టీలోకి చేరికల ప్రభంజనం మొదలైంది. ఇంద్రనీల్ ప్రచారం ప్రత్యర్థి పార్టీలకు ఒక సునామీని తలపించింది.

ఒకవైపు తన తండ్రి.. వొడితల సతీష్ కుమార్ ప్రచారంలో బిజీ బిజీగా గడపగా.. మరోవైపు యువనేత ఇంద్రనీల్ ప్రచారంలో అన్ని తానై వ్యవహరించారు. గ్రామగ్రామాన ప్రచారం పర్యవేక్షిస్తూనే.. అభివృద్ధి కార్యక్రమాల వివరాలు, లబ్ధిదారుల వివరాలు, గ్రామాల సమస్యలు, వాటి పరిష్కారాలు.. సామాజిక వర్గాల సమీకరణ, సోషల్ మీడియా అంశాలు నిరంతరం పర్యవేక్షించారు. ప్రతిరోజూ.. అన్ని మండలాలు చుట్టివస్తూ.. అందరిని కలుస్తూ.. చేరికల కార్యక్రమాలు నిర్వహిస్తూ… గులాబీ లో జోష్ నింపుతూ.. కారు స్పీడ్ పెంచారు. ఇంద్రనీల్ ప్రచార స్పీడ్.. గులాబీ రేటింగ్ పెంచడంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. నియోజకవర్గంలో ఒకవైపు ఇంద్రనీల్ వాయువేగంతో… ప్రచారం నిర్వహిస్తూ.. అలజడి సృషించగా.. మరోవైపు… ఆయనతో పోటీ పడుతూ.. ఇంద్రనీల్ తాత, సతీష్ కుమార్ తండ్రి మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు సైతం మనుమడితో సమానంగా 85 ఏళ్ల వయసులోనూ.. యువకుడిలా.. ప్రచారం నిర్వహించడం విశేషం.