ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి

ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి

కరీంనగర్:
ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓక్కరు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి తెలిపారు. గురువారం హుజురాబాద్, మానకొండూర్ నియోజకవర్గాలలో నిర్వహించిన హోం ఓటింగ్ లను జిల్లా ఎన్నికల ఆధికారి పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. ఎన్నికల సంఘం వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసిందన్నారు. అందులో భాగంగా 80 సంవత్సరాలు పైబడిన వృద్దులు మరియు 40 శాతం కన్న ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు వారి పోలింగ్ కేంద్రాల వరకు వెల్లి ఓటు వేయాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటివద్దకే ఎన్నికల అధికారులు వచ్చి వారి ఓటును తీసుకునే సౌలభ్యాన్ని కల్పించిందని పేర్కోన్నారు. పోలింగ్ రోజు ఇతర వికలాంగులు, వృద్దుల కొరకు వీల్ చైర్లను, ప్రత్యేక సదుపాయాలను కల్పించడం జరిగిందని తెలిపారు. మనం మన ఓటును సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న ఏర్పాట్లను గమనించి, ఓటుహక్కు కలిగిన ప్రతిఒక్కరు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గం బోర్నపల్లి గ్రామం సైదాపూర్ రోడ్డులో ఉండే 83 సంవత్సరాల వర్దినేని చిలుకమ్మ మరియు మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు నాగుల తిరుపతి (63)లు హోం ఓటింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. వారి ఇళ్లవద్దకు ఎన్నికల సిబ్బందితో కలిసి స్వయంగా వెళ్లి జిల్లాఎన్నికల అధికారి హోం ఓటింగ్ ఏవిధంగా చేయాలనే విషయాన్ని వివరించడంతో పాటు, ఓటు ప్రాధాన్యాన్ని వారికి, వారి కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డిఓ ఎస్. రాజు, హుజురాబాద్ మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, కళాశాల ప్రిన్సిపల్ నిర్మల, శంకరపట్నం తహసీల్దార్ అనుపమరావు తదితరలు పాల్గోన్నారు.