కాంగ్రెస్ తోనే తెలంగాణకు భవిష్యత్తు : దుదిల్ల శ్రీధర్ బాబు

కాంగ్రెస్ తోనే తెలంగాణకు భవిష్యత్తు…
. హరీష్ రావు వల్లే రైతుబంధుకు ఆటంకం.
. తెలంగాణ సంపద మన ప్రజలకే దక్కాలి
. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

జమ్మికుంట:
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బిఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వల్లే రైతుబంధు ఆగిపోయిందని, కానీ కాంగ్రెస్ ఈసికి ఫిర్యాదు చేయడం వల్లే ఆగిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి హాజరై ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అని గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. మ్యానిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశామని తెలిపారు. తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు పంచాలని 6 గ్యారంటీలను ప్రకటించామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆర్ఎస్ రెండు పార్టీలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచాయన్నారు. గతంలో రేషన్ దుకాణంలో 9 రకాల నిత్యావసరాల సరకులు ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒకే వస్తు అందజేస్తున్నదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిఅర్ఎస్ నాయకులు గ్యాస్ ధరను ఏందుకు తగ్గించలేదో చెప్పాలన్నారు. అగ్గిపెట్టె లాగా ఇల్లు కట్టిర్రు ఆన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఎందుకు పేద ప్రజలకు అందించలేదని ప్రశ్నించారు. హుజురాబాద్ లో ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇవ్వలేదనిన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇళ్లు కట్టుకోవడానికి 5లక్షలు ఇస్తుందని తెలిపారు. రైతు భరోసా ద్వారా రైతులను, కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ ద్వారా పేద వారికి వంద రోజులు పని దినాలు కల్పించి ఆదుకున్నామన్నారు. కేజీ టు పీజి విద్య ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చుడు రద్దు చేసుడు, పేపర్ లీకేజిలు చేసి నిరుద్యోగ విద్యార్థుల జీవితాలతో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆటలాడుకున్నదన్నారు. విద్యార్థులు భవిష్యత్ కోసం ఆలోచిస్తామన్నారు. ఈటల రాజేందర్ కంటే మెరుగైన ప్రగతి చేయాలని ప్రణవ్ రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజా సమస్యల్లో పాలుపంచుకునే మీ ముందు నిలబడే వ్యక్తి ప్రణవ్ అని అన్నారు. ఒకరిని ఇబ్బందీ పెట్టే వ్యక్తిత్వం ప్రణవ్ ది కాదన్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఉందని, అప్పుడు చేయలేని అభివృద్ధి ఎమ్మెల్యేగా గెలిచి చేస్తాడా ప్రశ్నించారు. ప్రణవ్ ను భారీ మేజరితో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఇప్పుడున్న జిల్లాలో పీవీ జిల్లా పేరు పెట్టాలని మ్యానిఫెస్టోలో పెట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, పుల్లూరి సదానందం, జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక, పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెపు సారంగపాణి, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాయిని రవి, జిల్లా కార్యదర్శి ఎగ్గని శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.