అభ్యర్థుల భవితవ్యం… ఈవీఎంలలో నిక్షిప్తం

అభ్యర్థుల భవితవ్యం… ఈవీఎంలలో నిక్షిప్తం
. స్ట్రాంగ్‌ రూంకు చేరిన ఈవీఎంలు, వీవీప్యాట్లు
. ఎస్సారార్‌ కళాశాలలో పటిష్ట బందోబస్తు
. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు

కరీంనగర్:
జిల్లాలో ఎన్నికల ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఇక అందరి ఆలోచన ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. జిల్లాలో నాలుగు శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రా (ఈవీఎం)ల్లో నిక్షిప్తమైంది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసే సమయానికి జిల్లాలో 75.32 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రధానపార్టీల అభ్యర్థులతో పాటు బరిలో ఉన్న స్వతంత్రులు సైతం తమను ఆశీర్వదించి ఓట్లు వేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలన్నీ చేశారు. గెలుపుపై కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటరుదేవుళ్లు ఎవరిని కరుణించారనేది ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తే తప్ప ఉత్కంఠకు తెరపడదు. కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో పరిధిలోని 1338 పోలింగ్‌ బూత్‌ల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. గురువారం పోలింగ్‌ ముగిసిన వెంటనే ఏజెంట్ల సమక్షంలో వాటికి సీల్‌ వేసీ పోలీసు బందోబస్తు మధ్య కరీంనగర్‌లోని ఎస్సాఆర్‌ఆర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. రాత్రి 10 గంటల వరకు కూడా అన్ని పోలింగ్‌ స్టేషన్ల నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్‌ రూంకు చేరలేదు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల ఓట్లను ఎస్సాఆర్‌ఆర్‌ కళాశాలలోనే లెక్కిస్తారు. అందుకోసం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలన్నిటని ఇక్కడే భద్ర పరిచారు. ఈవీఎం, వీవీ ప్యాట్లకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. డిసెంబర్ 3న ఓట్లను లెక్కించిన తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. అప్పటి వరకు అభ్యర్థులు ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.
కరీంనగర్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,59,215 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో 1338 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా 7,97,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కరీంనగర్ నియోజకవర్గం: 63.23 శాతం పోలింగ్ నమోదు
మొత్తం ఓటర్లు:3,55,054
ఓటు వేసిన వారు: 2,24,504
అందులో 1,12,025 మంది పురుషులు కాగా 1,12,458 మంది మహిళలు 21 మంది థార్డ్ జెండర్స్ 390 పోలింగ్ బూతుల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం: 83.19 శాతం పోలింగ్ నమోదు
మొత్తం ఓటర్లు:2,49,558
ఓటు వేసిన వారు: 2,07,609
అందులో 1,02,194 మంది పురుషులు కాగా 1,05,410 మంది మహిళలు 5 మంది థార్డ్ జెండర్స్ 305 పోలింగ్ బూతుల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మానకొండూరు నియోజకవర్గం: 83.21 శాతం పోలింగ్ నమోదు
మొత్తం ఓటర్లు:2,21,613
ఓటు వేసిన వారు: 1,84,413
అందులో 91,497 మంది పురుషులు కాగా 92,915 మంది మహిళలు ఒక థార్డ్ జెండర్స్ 316 పోలింగ్ బూతుల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చొప్పదండి నియోజకవర్గం: 77.77 శాతం పోలింగ్ నమోదు
మొత్తం ఓటర్లు:2,32,990
ఓటు వేసిన వారు: 1,81,194
అందులో 85,538 మంది పురుషులు కాగా 95,655 మంది మహిళలు ఒక థార్డ్ జెండర్స్ 327 పోలింగ్ బూతుల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.