22వ వార్డు అభివృద్ధి మాధ్యేయం..

0

దూసుకెళ్తున్న హస్తం…
– 22వ వార్డు అభివృద్ధి మాధ్యేయం..
– ఆదరించి ఆశీర్వదించండి
– కాంగ్రెస్ అభ్యర్థి వడ్లూరి శ్రీలేఖ
హుజురాబాద్ :
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులో హస్తం దూసుకెళ్తోంది. ఆ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్లూరి శ్రీలేఖ వార్డు అభివృద్ధే మా ధ్యేయమంటూ ప్రతి ఒక్క ఓటర్ ను కలుస్తూ వివరిస్తున్నారు. శ్రీలేఖ గెలుపు కాదు మెజార్టీ లక్ష్యంగా వార్డులో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో శ్రీలేఖ తండ్రి విజయకుమార్ మున్సిపల్ చైర్మన్ గా హుజురాబాద్ పట్టణాన్ని చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో శ్రీలేఖకు 22వ వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. హుజురాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత తన తండ్రి వడ్లూరి విజయ్ కుమార్ ది అని, రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా హిందూ స్మశాన వాటిక నిర్మాణం, సిసి రోడ్లు, మురుగు కాలువలు, సెంట్రల్ వీధిలైట్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను వడ్లూరి విజయ్ కుమార్ చేశారనీ ఆమె ప్రతి ఒక్క ఓటర్ కు వివరిస్తున్నారు. ఆమె తండ్రి సహకారంతో 22వ వార్డును మరింత అభివృద్ధి చేస్తానని అందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల్లో తనను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *