ఇందిరమ్మ రాజ్య స్థాపనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం…

ఇందిరమ్మ రాజ్య స్థాపనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం…
– ప్రజల మనసు నిండ కాంగ్రెస్సే…
– బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకే తాను ముక్కలే…
– ప్రజలంతా మంచి మనసుతో ఆలోచించి ఓటు వేయాలి
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబు

హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య స్థాపనే తమ లక్ష్యమని, దానికోసం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆశీర్వదించి ఈ నెల 30వ జరిగే ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబు అన్నారు .ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి స్వగృహంలో జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లోని బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు చెందిన సుమారు 500 మంది నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ…బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకే తాను గుడ్డలని గత పది సంవత్సరాలుగా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిఆర్ఎస్ పార్టీలు మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీని కట్టబెట్టి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రజలందరూ సహకరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకు అందించి మీ ఆశీర్వాదం తీసుకుంటానన్నారు. మహిళా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.

ప్రజలను మభ్యపెడుతున్న బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు…
బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ నయవంచన గురి చేస్తున్నాయని విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్యునిపై భారం మోపుతున్న పార్టీలను సార్వత్రిక ఎన్నికల్లో బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి అధికారం అందించి పట్టం కట్టాలన్నారు. ప్రణవ్ బాబా ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి మొలుగురు సదయ్య, బిఆర్ఎస్ పార్టీ వావిలాల గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మ శ్రీనివాస్, సదానందం, కలకోట యాదగిరి, నిరంజన్ రెడ్డి, మణెమ్మ, రమాదేవి, ఎండి షమీం లతోపాటు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, సుంకరి రమేష్, కసుబోజల వెంకన్న, ఎండి సలీం, ఎగ్గిని శ్రీనివాస్, ఎండి హుస్సేన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.