ప్రజా సంక్షేమ పార్టీ బిఆర్ఎస్..పాడి కౌశిక్ రెడ్డి

ప్రజా సంక్షేమ పార్టీ బిఆర్ఎస్..
. దామోదర్ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం
. చల్లూరు ను మండలంగా చేస్తా…
. ఆదరించి ఆశీర్వదించండి ఒక అవకాశం ఇవ్వండి..
. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్:
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ టిఆర్ఎస్ అని ఎన్నికల్లో సంక్షేమ పార్టీని ఆదరించి ఆశీర్వదించాలని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని వీణవంక మండలంలో పలు గ్రామాల్లో బిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయంగా ఎంత ఎదిగిన ఏ పదవిలో ఉన్న నేను హుజురాబాద్ నియోజకవర్గం బిడ్డగానే ఉంటానన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. దామోదర్ రెడ్డి ఆశయాల సాధన కోసం కృషి చేస్తానన్నారు. దామోదర్ రెడ్డి ఎక్కడ ఉన్న ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే మామిడాల పల్లిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తేనే ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. మామిడాల పల్లిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రైతుల కోసం 19 వేల కోట్ల రుణమాఫీ చేశారని, 17 కోట్లు ఇప్పటివరకు రుణమాఫీ అయిందని రెండువేల కోట్లు కూడా వారం పది రోజుల్లో అయిపోతుందన్నారు. నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులు ఎవరున్నా పూర్తి బాధ్యత నాదే అని అన్నారు. ముఖ్యంగా రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటు తోపాటు రైతుకు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, వికలాంగుల పెన్షన్లు, రైతు బీమా లాంటి ఎన్నో గొప్ప పథకాలను అమలు చేశారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా దళిత బంధు అమలుచేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణలోని ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త మేనిఫెస్టోతో ఎమ్మెల్యే గారి ప్రతిపక్షాలకు చెమటలు పడుతున్నాయన్నారు. ఓటమి భయంతో వణికి పోతున్నారు అన్నారు. కొత్త మేనిఫెస్టోలో మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం కింద రేషన్ కార్డు ప్రతి మహిళకు నెలకు 3000 చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు. అలాగే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 15 లక్షల వారికి పెంచమన్నారు. గ్యాస్ సిలిండర్ను కూడా 400కి ఇస్తామన్నారు. అలాగే అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందిస్తామని, రైతు బంధును కూడా 16 వేలకు పెంచుతామన్నారు. గ్రామాల్లో మిగిలిపోయిన రోడ్లు, భవనాల పాటు కుల సంఘాల దేవాలయాలు ఏవి ఉన్న నిర్మించి ఇస్తానని అన్నారు.

హుజరాబాద్ లో ఈటెల చేసింది ఏమీ లేదు..
ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ కు గత 20 సంవత్సరాలుగా ప్రజలు అవకాశం ఇచ్చిన హుజురాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఉప ఎన్నికల సమయంలో కూడా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే రెండు సంవత్సరాలు గడిచిన ఒక్కసారి కూడా నియోజకవర్గంలో కనిపించలేదని అన్నారు. 15 ఏళ్లుగా నియోజకవర్గంలో మీ మధ్యలోనే తిరుగుతూ మీకోసమే కష్టపడుతున్నానని అన్నారు. నా కష్టాన్ని గుర్తించి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో మీకు సేవ చేసుకుంటానని అన్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

బిజెపి, కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లోకి వలసలు…
నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలోకి రోజురోజుకీ కాంగ్రెస్ బిజెపి నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వలసలు వస్తున్నారు. కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి నుంచి సుమారు 50 మంది టిఆర్ఎస్ లో చేరగా, వీణవంక మండలం గంగారం నుంచి బిజెపికి చెందిన 50 మంది నాయకులు కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రథసారథి కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఒక కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది అని ముఖ్యమంత్రి అన్నారని, హుజురాబాద్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ తో కలిసి పని చేయాలన్నారు.