కాంగ్రెస్ లో చేరిన జర్నలిస్ట్ యువనేత ఎల్గోయి ప్రభాకర్

0

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జర్నలిస్ట్ యువనేత ఎల్గోయి ప్రభాకర్
. రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్ రంగంలో పనిచేసిన ప్రభాకర్
. జర్నలిస్ట్ యూనియన్ నేతగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాధ్యతలు
సంగారెడ్డి:

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్గోయి ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభాకర్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్గోయి ప్రభాకర్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.అంతకుముందు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తో కలిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపదాస్ మున్షిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కలిశారు.ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో సీనియర్ జర్నలిస్ట్ ఎల్గోయి ప్రభాకర్ కు పార్టీ కండువాను దీప దాస్ మున్షి కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, బిజెపి లోనుంచి కాంగ్రెస్ లో చేరిన పులిమామిడి రాజు ఉన్నారు.
రాజకీయాల్లోకి జర్నలిస్ట్ యువనేత ఎల్గోయి ప్రభాకర్..
సీనియర్ జర్నలిస్ట్ ఎల్గోయి ప్రభాకర్ విద్యార్థి దశలోనే , విద్యార్థి , యువజన సంఘాల లో పనిచేశారు. విద్యార్థి, యువజన సమస్యలపై అనేక. పోరాటాలు చేసిన అనుభవ కలదు. వామపక్ష పార్టీ లో కొంత కాలం పనిచేశారు. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో పని చేస్తున్నారు.ఆయన జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ జర్నలిస్ట్ సంఘాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జర్నలిస్టుల సమస్యలతోపాటు, ప్రజా సమస్యలపై, సామాజిక అంశాలపై కూడా పోరాటాలు చేసిన అనుభవాలు ఉన్నాయి. కొవిడ్ తొలి, రెండు దశాల్లోనూ కొవిడ్ రోగులకు, లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఆయన సహాయం అందించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్ కు ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజా సంబంధాలు ఉండడం,
కాంగ్రెస్ లో ఆయన చేరడంతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మరింత బలం చేకూరింది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని ప్రభాకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *