ఒక్క అవకాశం ఇవ్వండి 28వ వార్డు అభ్యర్థి కుమారస్వామి
ఒక్క అవకాశం ఇవ్వండి…
– వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
– 28వ వార్డ్ బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి దాసి కుమారస్వామి
హుజురాబాద్:
తనకు 28వ వార్డులో కౌన్సిలర్ గా ఒక అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్ది చూపిస్తానని 28వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి దాసి కుమారస్వామి పేర్కొన్నారు. శనివారం 28వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. తాను ఎల్లప్పుడు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. తన శక్తి మేరకు వార్డు ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్థానన్నారు. అందరిలో ఇంటిలో ఒక వాడిగా ఉంటానని, వార్డులో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
