పోరాట యోధుడికే మా మద్దతు

సంజయన్నా… మా భవిత మీరే..
. తొలి ఓటు మీకేనంటున్న యువత..
. పోరాట యోధుడికే మా మద్దతు
. బండి సంజయ్ కు వాకర్స్ భరోసా
. ఎన్నికల ప్రచారంలో బండికి అన్ని వర్గాల మద్దతు

కరీంనగర్:
ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో వాడవాడలా తిరుగుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కు అనూహ్య మద్దతు లభిస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ డివిజన్ కు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బీఆర్ఎస్ తో పోలిస్తే ఆలస్యంగా బండి సంజయ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటికీ స్థానికులు సంజయ్ పట్ల ఆప్యాయత, అనురాగాలు కురిపిస్తున్నరు. ఎక్కడికి వెళ్లినా పూలు చల్లి, తిలకం దిద్ది, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలుకుతూ నీరాజనం పడుతున్నారు. తొలిసారి ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులు గుంపులు గుంపులుగా బండి సంజయ్ ను కలుస్తూ మా తొలి ఓటు మీకే’ అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. గురువారం బండి సంజయ్ నివాసానికి వచ్చిన తొలి ఓటర్లు సంజయ్ తో ఫోటోలు దిగుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. మరోవైపు గురువారం ఉదయం బండి సంజయ్ శాతవాహన యూనివర్శిటీ, ఎస్సారార్ కళాశాల మైదానానికి వెళ్లి వాకర్స్ ను కలిశాను. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తాము కూడా అదే బాటలో ఉన్నట్లు చెప్పిన వాకర్స్ కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం మీకే ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని దీనిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు బండి సంజయ్ కు వృద్దులు నుండి సైతం సానుకూల స్పందన లభిస్తోంది. బహుదూర్ ఖాన్ పేట, తాహెర్ కొండాపూర్ గ్రామాల్లో ప్రచారం చేస్తున్న బండి సంజయ్ కు పలు చోట్ల వృద్ధులు కన్పించడంతో వారితో పలుచోట్లు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారి ఆలనాపాలన గురించి అడిగి తెలుసుకున్న బండి సంజయ్ అవ్వా… బాగున్నవా? అంతా మంచిదేనా? నువ్వు ఎవరికైనా ఓటేయ్.. కానీ ఒక్కటి గుర్తుంచుకో.. ఓటేసే ముందు నీ పిల్లలను గుర్తు తెచ్చుకో… వాళ్ల భవిష్యత్ గుర్తు తెచ్చుకో…వయసుదాటినా ఉద్యోగాల్లేక, పెండ్లికాక పనిలేక రోడ్లపై ఖాళీగా తిరుగుతున్న బిడ్డలను గుర్తు చేసుకో…అని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు అవ్వలు బిడ్డా…మాకు 2 వేల పెన్షన్ ఇచ్చి మా బిడ్డలకు ఉద్యోగాలియ్యకుండా కేసీఆర్ ఉసురు తీస్తుండు.. అయినా పెన్షన్ కేసీఆర్ ఇంట్లకెళ్లి ఇస్తున్నడా? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇస్తది. మాకు కావాల్సింది పెన్షన్ కాదు..మా పిల్లల భవిష్యత్తు..ఆ భవిష్యత్తు నువ్వే బిడ్డా.. సల్లగుండు.. మా ఓట్లు ఈసారి నీకే వేస్తం’’ అంటూ భరోసా ఇస్తున్నారు.

వెల్లువెత్తుతున్న చేరికలు…
మరోవైపు ఎన్నికల వేళ బీజేపీలో చేరికలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. బావుపేట కి చెందిన దుర్గం జగన్, ఓరుగంటి మల్లేశం ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఎంపీ ఆఫీస్ వద్ద 20వ డివిజన్ (హనుమాన్ నగర్) కు చెందిన వందమందికిపైగా బిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు.
సంజయ్…ఈ పైసలుంచు…
ఎన్నికల ప్రచారానికి వెళుతున్న బండి సంజయ్ కు పలువురు తమకు తోచినంత ఆర్దిక సాయం చేస్తూ ఆశీర్వదిస్తున్నారు. రాంనగర్ టెలిఫోన్ క్వార్టర్స్ మీదుగా వెళుతున్న బండి సంజయ్ కు స్వరాజ్యం అనే 60 ఏళ్ల మహిళ ఎదురుపడి సంజయ్.. ఇదిగో వెయ్యి నూటపదహారు రూపాయలు ఎన్నికల ఖర్చుకు పనికొస్తాయ్..ఉంచుకో అంటూ చేతిలో పెడుతూ ఆశ్వీరదించారు. నిన్న కమాన్ దగ్గర సైతం పాప శ్రద్ధ అనే చిన్నారి సంజయ్ వద్దకు వచ్చి సంజయ్ మామా… ఇదిగో నా కిడ్డీ బ్యాంకు పైసలు… ఖర్చుకు ఉంచుకో… అంటూ తను దాచుకున్న కిడ్డీ బ్యాంకును సంజయ్ కు అందజేసింది. అంబేద్కర్ స్టేడియం వద్ద వరుణ్ అనే బాలుడు సైతం సంజయ్ ను కలిసి తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకును అందజేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరోవైపు చిన్నారులు, పెద్దలు తనకు అందజేస్తున్న ఆర్దిక సాయాన్ని మొత్తం లెక్కించి వారి పేరుతో చెక్ తీసి పేదలకు నిరంతరం అన్నదానం చేస్తున్న అక్షయ ఫౌండేషన్ కు పంపిస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ తెలిపారు.