కార్పొరేట్లకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోడీ

1

దేశాన్ని కార్పొరేట్లకు దారా దత్తం చేస్తున్న మోడీ
. అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం
. కార్పొరేట్ల మేలుకోసమే చట్టాల సవరణ..
. ప్రశ్నించే వారిపై అర్బన్ నక్సలైట్లుగా ముద్ర..
. నిరుద్యోగులను మోసం చేసిన బిజెపి ప్రభుత్వం
. కార్పొరేట్లకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోడీ
. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
హుజూరాబాద్:
దేశంలో ఉన్న కార్పోరేట్లకు ప్రధాని మోడీ కొమ్ము కాస్తూ వారిక అనుగుణంగా చట్టాలను మార్పు చేస్తున్నాడని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చాడన్నారు. అందరికి అవకాశాలు కల్పిస్తానని, పాలనలో అందరికి భాగస్వామ్యం ఉంటుందని చెప్పి గద్దెనెక్కి నేడు ప్రజల మధ్య వైరుధ్యాన్ని పెంచాడే తప్పా చేసిన వాగ్దానాలల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిని అంతమోందించి విదేశాల్లో ఉన్నా అక్రమ ధనాన్ని తెచ్చి ప్రతి పౌరుని ఖాతాల్లో రూ. 15లక్షల చొప్పున జమ చేసి ఆర్థికంగా పరిపుష్టత చేకూర్చుతానని గొప్పగా చెప్పాడన్నారు. ఈ పదేళ్ల కాలంలో ఏ ఒక్కరి ఖాతలో పైసలు జమ కాలేదన్నారు. ఆకర్షనీయంగా వేషభాషలు మారుస్తూ మోడీ గంభీరమైన ఆహర్యంతో ముచ్చటైన పదాలతో ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. మేకిన్ ఇండియా పేరుతో డ్రామాలు అడుతున్నాడన్నారు. విదేశీ పెట్టుబడులతో దేశం అభివృద్ధి సాధిస్తుందన్నా అబద్దపు ప్రచారంతో దేశీయ ఉత్పత్తి, దేశీయ పెట్టుబడిని మోడీ గాలికి వదిలేశాడన్నారు. మరోవైపు మేకిన్ ఇండియా అంటూ స్వావలంభన చేకూర్చిన, లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు అమ్మివేస్తున్నాడని మండిపడ్డారు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జీఎస్టీ లాంటి పన్నులను ప్రజలందరి మీద బలవంతంగా రుద్దాడన్నారు. దీని ఫలితంగా స్వయం ఉపాధి రంగంలోని చిన్న వ్యాపారాలు కుప్పకూలిపోయాయని ఆవేదన వ్యర్థం చేశారు. కొత్త ఉద్యోగాలను కల్పించకపోగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని లక్షలాది మంది శాశ్వత ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో తొలగించారన్నారు. దేశంలో ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్ల ముద్ర వేస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరేమో విద్వేషాలు రెచ్చగొట్టి, మరొకరేమో తెలంగాణ చరిత్రను వక్రీకరించి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు అంబటి నాగయ్య, రైతు స్వరాజ్య వేధిక నాయకులు కన్నెగంటి రవి, ప్రజా సంఘాల జేసీ చైర్మన్ కూపాటి వెంకటనారాయణ, టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముక్కెర రాజు, నాయకులు వేల్పుల రత్నం తదితరులు పాల్గొన్నారు.

1 thought on “కార్పొరేట్లకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన మోడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *