కోహెడను సస్యశ్యామలం చేసాం: ఎమ్మెల్యే సతీష్ కుమార్

ప్రజా సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యం..
. 8చెక్ డ్యాములు 62 కోట్లతో నిర్మించి కోహెడను సస్యశ్యామలం చేసాం..
. శనిగరం ప్రాజెక్టుకు 23 కోట్లు, సింగరాయ ప్రాజెక్టుకు 5 కోట్లు కేటాయించాం..
. తెలంగాణ ఉద్యమ కాలం నుండి బీఆర్ఎస్ పార్టీ కంచుకోట కోహెడ
. ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించండి.. సతీష్ కుమార్

హుస్నాబాద్:
ప్రజా సంక్షేమ బిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్ళపల్లి, కూరెళ్ళ, ధర్మసాగర్ పల్లి, వెంకటేశ్వర్ల పల్లి, అనుబంధ గ్రామం షేర్ అలీఖాన్ నగర్ లలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రజలు సతీష్ కుమార్ కు మంగళ హారతులతో, కోలాటాలతో, బతుకమ్మలు, బోనాలతో, డప్పుచప్పులతో ఘన స్వాగతం పలికారు. బొట్టు పెట్టి ,పూలమాలలు వేసి శాలువాతో సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలో మోయతుమ్మెద వాగు, ఎల్లమ్మవాగు, పిల్లివాగు లపై 8 చెక్ డ్యాములు 62 కోట్ల వ్యయంతో నిర్మించి నీటిని నిల్వ చేసుకోవడం వల్ల కోహెడ మండలంలో వేల ఎకరాలు సస్యశ్యామలమై పచ్చని పంటలు పండుతున్నాయన్నారు. సింగరాయ ప్రాజెక్టు సామర్ధ్యాన్ని 0.5 టీఎంసీ నుండి 1.0 టిఎంసిగా పెంచామని అందుకు 5 కోట్లు వెచ్చించామని, కోహెడ మండల వరప్రదాయని నిజాం కాలంనాటి శనిగరం ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం 23 కోట్లు కేటాయించామన్నారు. కోహెడ పోలీస్ స్టేషన్ శాశ్వత భవనం 2 కోట్లతో నిర్మించామన్నారు. తంగళ్ళపల్లి గ్రామ అభివృద్ధి, సంక్షేమానికై ఇప్పటివరకు 44.29 కోట్లు కేటాయించానని, కూరెళ్ళ గ్రామానికి 34.51 కోట్లు, నూతన గ్రామపంచాయతీ ధర్మసాగర్ పల్లికి 7.98 కోట్లు, వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి 8.91 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా, శ్రీనిధి లోన్లు, కేసీఆర్ కిట్లు, అంగన్వాడీ కేంద్రం నిర్వహణ కోసం నిధులు, తెల్లరేషన్ కార్డుల ద్వారా రేషన్ బియ్యం, చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య ఖర్చుల కోసం నిధులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ వివిధ పథకాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదన్నారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల సహకారంతో 9076 కోట్లతో అభివృద్ధి చేశానన్నారు. మున్ముందు బృహత్తరమైన ప్రణాళికలతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానన్నారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా మూడవసారి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.
బిఆర్ఎస్ లో చేరిక…
సతీష్ కుమార్ కు మద్దతుగా కోహెడ మండలం తంగళ్ళపల్లి, కూరెళ్ళ, వెంకటేశ్వర్ల పల్లి, ధర్మసాగర్ పల్లి నుండి సుమారు 60 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సతీష్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు.