కేసిఆర్ అంటే నమ్మకం భరోసా.. సతీషన్న ప్రజల మనిషి

హుస్నాబాద్ మున్సిపాలిటీని ప్రత్యేక దృష్టితో సమగ్ర అభివృద్ధి చేసాం..
. అభివృద్ధికి నిదర్శనంగా జాతీయస్థాయిలో రెండుసార్లు అవార్డులు
. అవసరమైతే ఇంకా నిధులు ఇస్తాం.. అభివృద్ధిలో రాజీపడం
. కేసిఆర్ అంటే నమ్మకం భరోసా.. సతీషన్న ప్రజల మనిషి
. హుస్నాబాద్ లో సతీష్ కుమార్ గెలుపు ఖాయం

హుస్నాబాద్:
హుస్నాబాద్ మున్సిపాలిటీని ప్రత్యేక దృష్టితో సమగ్ర అభివృద్ధి చేసామని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్, మంత్రి హరీష్ రావు, హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ మాజీమంత్రి పెద్దిరెడ్డి లతో కలిసి రోడ్ షో నిర్వహించారు. హరీష్ రావు మాట్లాడారు. ఈ జన ప్రభంజనాన్ని చూస్తుంటే, ఈ ఉత్సాహం, ఊపు చూస్తూ ఉంటే సతీషన్నకు భారీ మెజారిటీ గెలవడం ఖాయమన్నారు. నీతి, నిజాయితీ, నిబద్దతతో పనిచేసే వ్యక్తి సతీషన్న అలాగే కేసిఆర్ కు హుస్నాబాద్ నియోజకవర్గ లక్ష్మీ నియోజకవర్గమని అవసరమైన నిధులు ఇచ్చామని, అభివృద్ధి చేసామన్నారు. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించామని, దేవాదుల, మిడ్ మానేరు ద్వారా హుస్నాబాద్ గడ్డకు గోదావరి జలాలు వస్తున్నాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయిందని, రైతుబంధు, రైతు బీమా, ఆరోగ్య భీమా, అసైన్డ్ భూములకు పట్టాలు, రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం, సౌభాగ్య లక్ష్మి అందిస్తున్నామన్నారు. ప్రజలందరూ గమనించి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటెయ్యాలని ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగుతుందని హరీష్ రావు అన్నారు. ఎల్లమ్మ చెరువుకు రెండున్నర కోట్లు ఇప్పటివరకు ఇచ్చానని అలాగే హుస్నాబాద్ ఎల్లమ్మ గుడికి 50 లక్షలు మంజూరు చేశానని ఇంకా కావాలన్నా ఇస్తానన్నారు. గిరిజనులకు మూడు కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తున్నామని, ఇతర సామాజిక భవనాలు నిర్మిస్తామని హుస్నాబాద్ అభివృద్ధికి నాది బాధ్యత హరీష్ రావు తెలిపారు.
ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేస్తా: అభ్యర్థి సతీష్ కుమార్
గడిచిన రెండు ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల్లో కూడా ఆశీర్వదిస్తే ఉత్సాహంతో మరింత అభివృద్ధి చేస్తానని బిఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ అన్నారు. 2014 కు ముందు హుస్నాబాద్ ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సహకారంతో హుస్నాబాద్ నియోజకవర్గానికి వేలకోట్ల నిధులు తెచ్చానన్నారు. ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయించానని, రెవెన్యూ డివిజన్ చేసుకున్నామని తెలిపారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
బిఆర్ఎస్ లో చేరిన గవ్వ వంశీధర్ రెడ్డి…
కోహెడ మండలానికి చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి తన అనుచరులతో కలసి మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన గౌడ యూత్ అధ్యక్షుడు రంజిత్ గౌడ్ తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు, హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.