అభివృద్ధి, సంక్షేమ పథకాల రథసారధి కేసీఆర్

సంక్షేమం కావాలా… సంక్షోభ పార్టీ లు కావాలా…
. అభివృద్ధి, సంక్షేమ పథకాల రథసారధి కేసీఆర్
. రెండుసార్లు ఆశీర్వదించారు అభివృద్ధి చేశా.. మూడోసారి పట్టం కట్టండి
. బిఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్:
ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ కావాలా… సంక్షోభం సృష్టించే పార్టీలు కావాల ప్రజలే ఆలోచించుకోవాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని సైదాపూర్ మండలం లోని పలు గ్రామాల్లో హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ మాజీమంత్రి పెద్దిరెడ్డి తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు, యువకులు, ప్రజలందరూ ఆయనకు మంగళ హారతులతో, బొట్టు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమం, విశ్వసనీయతకు మారుపేరే బిఆర్ఎస్ పార్టీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 కంటే ముందు పరిస్థితులు ఏ విధంగా ఉండే, గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చెందింది ప్రజలందరూ గమనించాలన్నారు. ఎన్నికలప్పుడే కనబడే ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. మీ వాడిని, మీలో ఒకడిని, అడిగిన ప్రతి పని చేస్తూ నియోజకవర్గాన్ని సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలలో అభివృద్ధి చేశానని తెలిపారు. మున్ముందు నియోజకవర్గ అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నానని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు అధికారం పై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని నియోజకవర్గ ప్రజలు తెలివైన వారు, ఉద్యమకారులు, విజ్ఞానవంతులు, మంచి, చెడు తెలిసినవారన్నారు. అభివృద్ధిని చూసి మరొకసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని సతీష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అక్కన్నపేట మండల యువకులు బీఆర్ఎస్ లోచేరిక..
అక్కన్నపేట మండలం గౌరవెల్లి, చిన్నగుబ్బడి గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన 15 మంది యువకులు హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సతీష్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు.
గులాబీగూటికి చిగురుమామిడి బిజెపి మండలాధ్యక్షుడు..
చిగురుమామిడి బిజెపి మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ 150 మంది తన అనుచరులతో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు, లక్ష్మీనారాయణకు ఆయన అనుచరులకు సతీష్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులమై అలాగే 2023 బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ రెండు పర్యాయాలు గణనీయంగా అభివృద్ధి చేశారన్నారు. మూడవసారి కూడా సతీష్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించుకోవాలని ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని వెల్లడించారు.