సీఎం కేసీఆర్ కు ప్రియ శిష్యుడు కౌశిక్ రెడ్డి: హోం మంత్రి మహమూద్ అలీ

 

సీఎం కేసీఆర్ కు ప్రియ శిష్యుడు కౌశిక్ రెడ్డి
. బిఆర్ఎస్ తోనే మైనార్టీల అభివృద్ధి
. హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ

హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రియ శిష్యుడు, ఆయన అడుగుజాడల్లో నడిచే వ్యక్తి కౌశిక్ రెడ్డి అని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 2,15,16,17 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన హోం మంత్రి మాట్లాడారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి కౌశిక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ కు మధ్య సాన్నిహిత్యం చాలా ఉందని, హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లయినా తీసుకువస్తారన్నారు. కాంగ్రెస్, బిజెపి వాళ్ళతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. బిజెపి నాయకులు కనీసం కేంద్రం నుంచి 100 కోట్లు కూడా రాష్ట్రానికి తీసుకువచ్చిన పాపాన పోలేదని అన్నారు. తెలంగాణలో ఢిల్లీ నాయకులు అభివృద్ధి చేయలేరని తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతే ముస్లింలకు అన్ని విధాలుగా న్యాయం జరిగిందన్నారు. కౌశిక్ రెడ్డి మనసు కూడా చాలా మంచిదని, ప్రజల క్షేమం కోసమే ఎప్పుడు తాపత్రయపడతాడని అన్నారు. హుజురాబాద్ అభివృద్ధి చెందాలంటే కౌశిక్ రెడ్డికి ఓటు వేయాలని అన్నారు. ఎన్నికల గెలుపు కోసం ఎవరు ఎన్ని విష ప్రచారాలు చేసినా బిఆర్ఎస్ బిజెపితో కలవదన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కావడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకే ఇష్టం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని, ఆయన పూటకు ఒక పార్టీ మారుస్తూ ఉంటాడని విమర్శించారు. ముస్లింలకు అన్ని విధాల న్యాయం జరగాలంటే ఒక కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో కౌశిక్ రెడ్డి అధిక మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హుజురాబాద్ ని దత్తత తీసుకుంటాను అనడం గర్వంగా ఉందని, రాబోయే రోజుల్లో హుజురాబాద్ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వై చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, లతో పాటు కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.