కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలయింది

0

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలయింది
. ప్రాజెక్టును అన్ని తానై నిర్మించానని చెప్పిన కేసీఆర్ పిల్లర్లు కుంగిపోతే ఎందుకు నోరు విప్పడం లేదు
. కాలేశ్వరంలో జరిగిన అక్రమాలను తెలంగాణ సమాజానికి తెలిపేందుకే మంత్రులు ఎమ్మెల్యేలతో సందర్శన
. కాలేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో భాగంగా విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కాళేశ్వరం:
తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలి అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్ పైన పిల్లర్లు కుంగిపోయిన విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి వేరువేరు ప్రత్యేక బస్సులు మంగళవారం మేడిగడ్డను సందర్శించారు. మధ్యాహ్నం అసెంబ్లీ నుండి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మూడు గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ ని చేరుకున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన నిర్మాణ పనులను కుంగిపోయిన పిల్లలను బ్యారేజీ పైన క్రింద పరిశీలించారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు కాలేశ్వరం ప్రాజెక్టు ప్రధాన ఇంజనీరింగ్ తో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాజు రతన్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం అక్కడే విలేకరుల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టుకు రూ. 97 వేల కోట్లు వ్యయం చేసిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్,
మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం లో భాగంగానే మంగళవారం ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీల తో పాటు ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన చేపట్టామని తెలిపారు.ఈ పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించామని తెలిపారు. బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని విమర్శించారు.
కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకుల వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదన్నారు.అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయని తెలిపారు.మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గిరిజన శాఖ మంత్రి సీతక్క బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తోపాటు ఎంఐఎం సంబంధించిన ఇద్దరి ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *