ఇంటలిజెన్సీ అడిషనల్‌ డీజీపితో పురుమల్ల..

0

ఇంటలిజెన్సీ అడిషనల్‌ డీజీపితో పురుమల్ల..
. వైరల్‌ అవుతున్న ఫోటో..
కరీంనగర్:
కాంగ్రెస్‌ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జి పురుమల్ల శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో ఇంటలిజెన్సీ అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ శివధర్‌ రెడ్డిని కలిసినట్లు ఉన్న ఫోటో వైరల్‌ అవుతోంది. సీఎం రేవంత్‌ రెడ్డి, అడిషనల్‌ డీజీపిని కలసినట్లు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం నియోజకవర్గంలో హాట్‌టాఫిక్‌గా మారింది. కరీంనగర్‌ పోలీస్‌ కమీషనరేట్‌లో ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ ద్వారా పలు కబ్జా కేసుల్లో బీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లు, నేతలు అరెస్టు అయి రిమాండ్‌కు వెల్లిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేత పురుమల్ల శ్రీనివాస్‌పై కూడా అనేక కేసులున్నాయి. ఆయన కూడా అరెస్టు అవుతాడనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి, అడిషనల్‌ డీజీని కలిసినట్లు ఫోటోలు వైరల్‌ కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *