హుజురాబాద్ ను మరో సిద్ధిపేటల తీర్చిదిద్దుతా..

 

కెసిఆర్ నోట హుజరాబాద్ అభివృద్ధి మాట…
. అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..
. హుజురాబాద్ ను మరో సిద్ధిపేటల తీర్చిదిద్దుతా..

హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి కోరారు. జమ్మికుంటలో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నోట హుజరాబాద్ అభివృద్ధి నా బాధ్యత అనే మాట కూడా వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హుజరాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి, చిన్న పాపపల్లి, కాట్రపల్లి, దమ్మక్కపేట ఇప్పల నర్సింగాపూర్ గ్రామాలలో జరిగిన ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి మంత్రంగా బిఆర్ఎస్ పార్టీ పని చేస్తుందన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తూ రైతుల గుండెల్లో గుడి కట్టుకున్న మహానీయుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఉన్న పేద ప్రజల బాగోగుల కోసం ఆలోచించి కొత్త మేనిఫెస్టో తయారు చేశారని మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతిమహిళకు 3000 రూపాయలు అందించడంతోపాటు ఆరోగ్యశ్రీని 15 లక్షల పెంచుతామని అన్నారు. దీంతోపాటు ప్రతి కుటుంబానికి కెసిఆర్ ధీమా ప్రతి ఇంటికి భీమా అనే పథకంతో 5 లక్షల ఉచిత బీమా అందించడంతోపాటు గ్యాస్ సిలిండర్ ని కూడా 400 కి ఇవ్వనున్నామన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం కూడా అందించనున్నామన్నారు. ఉప ఎన్నికల సమయంలో సెంటిమెంటు డైలాగులతో నియోజకవర్గంలో ఓట్లు వేయించుకొని కనీసం గెలిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా నియోజకవర్గానికి వచ్చి ప్రజల బాధలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గత ఏడుసార్లు ఇక్కడి ఎమ్మెల్యే ఈటలకు అవకాశం కల్పించిన హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాడని అన్నారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చిన ఇక్కడి ఎమ్మెల్యే ఈటెల చేయని అభివృద్ధిని ఒకే ఒక అవకాశం కల్పిస్తే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ నేను చెప్పిన విధంగా అభివృద్ధి చేయకుంటే మళ్లీ మీ ముందుకు ఓట్ల కోసం రానని అన్నారు. మూడోసారి కూడా బిఆర్ఎస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి హుజురాబాద్ అభివృద్ధి కోసం 1000 కోట్లు తీసుకువచ్చి హుజురాబాద్ నియోజకవర్గం మరో సిద్ధిపేట తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు బంగారు బాతని దానిని మంది మాటలు విని కోసుకుందామంటే మాత్రం బాధపడేది మనమేం అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మొత్తం బిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు, బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హుజురాబాద్ను అద్భుతంగా చేస్తానని హామీ ఇచ్చారు. కొత్త మండలాలతో పాటు 1000కోట్ల రూపాయలు కూడా అడిగితే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. వేర్వేరుగా జరనీ కార్యక్రమాలు మాజీమంత్రి ఇనగల పెద్దిరెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్,

మా కష్టాన్ని కూడా గుర్తించండి .. కౌశిక్ రెడ్డి సతీమణి షాలిని…
గత 15 సంవత్సరాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటున్నామని ఒకసారి మా కష్టాన్ని కూడా గుర్తించాలని, దండం పెట్టి, కొంగు పట్టి అర్ధిస్తున్న ఒక్క అవకాశం ఇవ్వాలంటూ హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు ఇప్పటివరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటుచేసిన గొప్ప ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని అభివృద్ధి పనులన్నీ చేపించే బాధ్యత తీసుకుంటామన్నారు.