కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి తేలేదెలా?

0

కాళేశ్వరంపై విచారణ ఏది?
. జ్యుడిషియల్ విచారణను మేడిగడ్డకే పరిమితం చేస్తారా?
. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి తేలేదెలా?
. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధం
. కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలి
. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధం
. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందని చెప్పిన కాంగ్రెస్ నేతలు… నేడు అందుకు భిన్నంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపైనే జ్యుడీషియల్ విచారణ కోరడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధమన్నారు. అయోధ్యలో రామ మందిర పున: ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం విడ్డూరమన్నారు. ఇది బీజేపీ కార్యక్రమం కానేకాదని, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు పాల్గొనే మహత్తరమైన కార్యక్రమమన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ విధానామేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం గీతాభవన్ చౌరస్తా నుండి ఎస్సారార్ కళాశాల వరకు నిర్వహించిన 3 కే రన్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఎస్సారార్ కళాశాల విద్యార్థుల వద్ద యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఏబీవీపీ పూర్వ విద్యార్ధిగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే 3కే రన్ పాల్గొనడం ఆనందంగా ఉంది. స్వామి వివేకానంద చరిత్ర, ఆశయాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. స్వామి వివేకానంద గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేత వివేకానంద అని, అమెరికాను కొలంబస్ కనుగొంటే…. అమెరికన్ల ఆత్మను తట్టిలేపిన వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. విదేశాల్లో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ఎన్నటికీ మరువలేనిదన్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్క్రతిని ప్రపంచానికి చాటిన నేత అని కొనియాడారు. వివేకానంద స్వామి స్పూర్తితో ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారని, కానీ రాష్ట్ర పాలకులు యువతను మద్యం, డ్రగ్స్ కు బానిసను చేస్తున్నారన్నారు. మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు సంపాదిస్తుండటం బాధాకరమన్నారు. స్కూళ్లను, ప్రభుత్వ స్థలాలను అడ్డాగా చేసుకుని చాక్లెట్ల రూపంలో యువతను కొందరు మూర్ఖులు డ్రగ్స్ కు బానిసలను చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకుని భారత్ ను శక్తివంతమైన దేశంగా మార్చాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. భారత్ మాత ప్రపంచపు అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న దృశ్యాన్ని నేను కళ్లారా చూశానంటూ 130 ఏళ్ల క్రితమే వివేకానంద చెప్పారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *