సంక్షేమం కావాలా.. సంక్షోభం కావాలా..

0
  • సంక్షేమ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే
  • బిజెపికి ఓటు వేస్తే సిలిండర్ ధర 2 వేలు
  • మాయమాటలకు మోసపోతే గోస పడుతరు
  • హుజూరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే
  • సర్వేలన్ని కౌశిక్ రెడ్డి గెలుపును సూచిస్తున్నాయి
  • కౌశిక్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వండి
  • మంత్రి హరీష్ రావు

హుజురాబాద్:
తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలా… సంక్షోభం సృష్టించే ప్రభుత్వాలు కావాలా.. ప్రజలే ఆలోచించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్వేలన్నీ కౌశిక్ రెడ్డి గెలుస్తాడని చెబుతున్నాయన్నారు. ఇక హుజురాబాద్ లో జీ హుజూర్ రాజకీయాలు నడవయన్నారు. ఉప ఎన్నికల్లో గట్టెక్కెందుకు రాజేందర్ ఎన్నో మాయమాటలు చెప్పాడన్నారు. దళిత బంధు రాదని ఒక అపనమ్మకాన్ని సృష్టించాడన్నారు. కానీ కెసిఆర్ అంటే ఒక నమ్మకం, విశ్వాసం అని హుజురాబాద్ లో 100 శాతం అమలు చేసి చరిత్ర సృష్టించాడన్నారు. పండిన పంటను తంటాలు లేకుండా కాంటాలు పెట్టి కెసిఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్, బిజెపి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేం లేదన్నారు. ఈ రెండు పార్టీల్లో ఏది గెలిచిన తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజల కోసం కొత్త మేనిఫెస్టో తయారు చేశారన్నారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 3వేలు అందించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ని ఐదు లక్షల నుంచి 15 లక్షల పెంచామని, గ్యాస్ సిలిండర్ ను కేవలం రూ.400 కి అందిస్తామన్నారు. దీంతోపాటు కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా అనే పథకం ద్వారా రేషన్ కార్డులో ఉన్న వారు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం ఆగం కాకుండా ఉండేందుకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు. కౌశిక్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే హుజురాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే అని హరీష్ రావు హామీ ఇచ్చారు.

ఈటల మాటలు వింటే హుజురాబాద్ పదేళ్ల వెనక్కి…
హుజురాబాద్ ప్రజలు ఈటల మాటలు వింటే అభివృద్ధిలో పదేళ్లు వెనుకబడిపోతారని అన్నారు రాజేందర్ గాని బిజెపి కానీ హుజురాబాద్ కు ఒక రూపాయి నిధులను తెచ్చాడా అని ప్రశ్నించారు టిఆర్ఎస్ వచ్చినాకనే హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు ఈ రెండేళ్లలో నియోజకవర్గంలో ఒక తట్టెడు మట్టి అన్న తీశాడా అంటూ రాజేందర్ ను ప్రశ్నించారు ఒక రూపాయి నిధులను తెచ్చాడా అని అడిగారు గెలిచినంక హుజురాబాద్ ను విడిచిపెట్టి వెళ్ళాడని విమర్శించారు హుజరాబాద్ గజ్వేల్ లో ఈటల ఓటమి ఖాయమన్నారు. ఓటమి అనంతరం రెండింటికి చెడ్డ రేవడిగా మిగులుతాడని విమర్శించారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని అది ఒక కల మాత్రమేనని పేర్కొన్నారు. ఈటల మాటలతో మోసపోతే హుజురాబాద్ ప్రజలు గోసపడుతరని తెలిపారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందన్నారు.

ఢిల్లీ నాయకులతో హుజురాబాద్ కు ఒరిగేదేంటి..
ఢిల్లీ నాయకులను హుజురాబాద్ కు తీసుకు వస్తున్న ఈటల వారితో ఈ నియోజకవర్గానికి ఒరిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని రాజేందర్ ను ప్రశ్నించారు. ఢిల్లీ చేతిలో ఉన్న ఉప్పల్ ఆర్ఓబి ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదన్నారు. దమ్ముంటే ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవని మాట్లాడుతున్న రాజేందర్ తెలంగాణ వ్యతిరేకులతో పొత్తు ఎట్ల పెట్టుకున్నారని విమర్శించారు తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వనన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజేందర్ కు సలహాదారుడు అన్నారు సమైక్యవాదులతో పదవుల కోసం చేతులు కలిపిన ఈటల రాజేందర్ బుద్ధి చెప్పాలన్నారు ఈ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేస్తే సిలిండర్ ధర 2వేలకు చేరుతుందన్నారు. ప్రజలంతా ఆలోచించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ ను ఆదరించి కౌశిక్ రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు తక్కలపల్లి రాజేశ్వర్ రావు, గందె రాధిక, జమ్మికుంట ఎంపీపీ దొడ్డే మమత, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జన సందోహంగా మారిన జమ్మికుంట…
జమ్మికుంట పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన స్ట్రీట్ మీటింగ్ కు జనం వేలాదిగా తరలివచ్చారు. దీంతో జమ్మికుంట పట్టణమంతా జన సందోహంగా, గులాబీ మయంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *