ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి: కలెక్టర్ పమేలా సత్పతి

ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి
. ఓట్లను కోరుతూ వచ్చే ఎస్ఎంఎస్ లపై ఫిర్యాదులను సమర్పించండి
. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
ప్రజలందరు ఏలాంటి ప్రలోభాలకు లొంగకుండా వారి ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటును వినియోగించుకోకపోయినట్లయితే దానికి ఎటువంటి విలువ ఉండదన్నారు. ఓటు హక్కును వినయోగించుకోవాలనే నిర్ణయం రాబోయో 5 సంవత్సరాల వరకు వర్తిస్తుంది కాబట్టి, ఎటువంటి ప్రలోబాలకు గురికాకుండా నిక్కచ్చిగా మీ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. 28 నవంబర్ 2023 నుండి 30 నవంబర్ 2023 (48 గంటలు)వరకు ప్రజలకు వచ్చే ఎస్ఎంఎస్ సంక్షిప్త సందేశాలపై 9030172072 ఫోన్ నెంబరుకు ఫిర్యాదు చేయాలన్నారు. అలాంటి ఫిర్యాదులపై ఐపిసి, ప్రజా ప్రాతినిద్య చట్టం 1951 ప్రచారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ఈనెల 30న పోల్ ముగిసే వరకు సైలెంట్ పిరియడ్ ను పాటించాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా డ్రై డేకు నిర్వహించిన జిల్లాలో ఉన్నటు వంటి అన్ని మద్యo షాపు లను మూసివేయడం జరుగుతుందన్నారు. మెడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను మరింత పకడ్బందీగా అమలు చేయడంలో బాగంగా జిల్లాలోని ఎఫ్.ఎస్.టి, ఎస్ఎస్టి బృందాలను బలోపేతం చేశామన్నారు. ఇంట్రిగెటెడ్ కంట్రోల్ రూం ల ద్వారా మరింత పకడ్బందీగా పరిశీలించడం జరుగుతుందని పేర్కోన్నారు.
జిల్లాలో 1338 పోలింగ్ కేంద్రాలు…
జిల్లాలోని 1338 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 289 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరుగిందన్నారు. తోమ్మిది వందల పొలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ను, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. జిల్లాకు వచ్చిన ఏపిక్ కార్డులన్నింటిని ఇప్పటికే అందజేయడం జరుగగా, సోమవారం నాడు జిల్లాకు వచ్చిన మరో 6700 ఎపిక్ కార్డుల పంపిణిని కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కోన్నారు. 96శాతం ఓటర్ ఇన్ఫర్మెషన్ స్లిప్పులను బిఎల్ఓల ద్వారా ప్రతి ఇంటికి పంపిణి చేయడం జరిగిందన్నారు. ఓటర్ ఇన్ ఫర్ మెషన్ స్లిప్పుల పంపిణి ద్వారా బదిలి, చనిపోయిన ఓటర్లను గుర్తించడం జరుగుతుందని, 1.93 శాతం బదిలి, చనిపోయిన ఓటర్లను జిల్లాలో గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను మంగళవారం సాయంత్రం నుండి కఠినంగా అమలు చేయడం జరుగుతుందని, అందులో బాగంగా మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి టెలివిజన్ ద్వారా గాని, సంక్షిప్త సందేశాలు, వాయిస్ రికార్డెడ్ ఫోన్ కాల్స్, వాహనాలు, లౌడ్ స్పికర్, క్యాంపేన్ లు జరగరాదని వాటికి అనుమతులు కూడా ఇవ్వడం జరగదన్నారు. మద్యం అమ్మకాలు, రవాణ జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. ఎక్సైజ్ మరియు పోలీస్ శాఖల ద్వారా పరిశీలించడం జరుగుతుందని పేర్కోన్నారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలలో ఓటుహక్కు లేని రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎవరు ఉండకూడదన్నారు. మీడియా ద్వారా ఎటువంటి ఒపినీయన్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం వంటివాటిని చేయకూడదని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల లోపల పోలింగ్ సంబంధించిన పనులు మాత్రమే జరగాలని, ఎటువంటి రాజకీయ ప్రచారానికి సంబంధించి కార్యక్రమాలను నిర్వహించరాదని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటుకు సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఓటరు ఇన్ ఫర్మెషన్ స్లిప్ ఓటరుకు అవగాహన కల్పించడానికి మాత్రమే పనిచేస్తుందన్నారు. ఎపిక్ కార్డు కాకుండా 12రకాల ఓరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులలో ఎదో ఒకటి ఓటరు పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికలప్రవర్తన నియావళి ఉంఘనలపై వచ్చే ఫిర్యాదులపై చర్యలుతీసుకోవడం జరుగుతుందన్నారు. ఇకపై ఎదైన ఉలంఘన జరిగితే నేరుగా ఫిర్యాదు చేసిన వాటిపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో అంకిత భావంతో స్విప్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా 25వేల కొత్త ఓటర్లను నమోదు చేయడం జరిగిందన్నారు. కళాశాలలో నిర్వహించిన స్వీప్ కార్యక్రమాల ద్వారా 5507 మొదటి సారి ఓటుహక్కను కల్పించడం జరిగిందన్నారు. 21 సంవత్సరాలు నుండి 28 సంవత్సరాలు గల 11200 మంది యువ ఓటర్లును గుర్తించి వారందికి ఎపిక్ కార్డులను అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో 12డి ఫారాలను సమర్పించిన 1195 మంది దివ్యాంగులు, వయోవృద్దుల ఇళ్లవద్దకే వెళ్లి హోం ఓటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ బుదవారం వరకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా జిల్లాలో 5700 మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోగా, అందులో 5400 మంది మన జిల్లాలకు చెందిన వారని, ఇక్కడ పనిచేస్తూ, మరో జిల్లాలో ఓటుహకు కలిగి ఉన్న 1200 మందికి పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. ఫామ్ 12 సమర్పించక పోవడం, ఎలక్షన్ డ్యూటి ఆర్డర్ జతచేయకపోవడం, బయటి జిల్లా ఆర్వోల నుండి ఫారం ఇక్కడకు చేరుకోకపోవడం వంటి కారణాల ద్వారా పోస్టల్ బ్యాలెట్ లో కొంత ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొవాల్సి వచ్చిందని తెలిపారు.