కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు..

0

కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదు
. కాంగ్రెస్ ఝూటా పార్టీ
. మోసపూరిత హామీలతో గద్దెనెక్కింది
. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ నయాపైసా పనైనా చేశాడా?
. పార్లమెంటులో ప్రశ్నించే గొంతుక వినోద్కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం
. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి

హుజూరాబాద్:
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందని, హామీలు నెరవేర్చని ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ఓటు అడిగే హక్కు లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజలింగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హుజురాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిండా ముంచి గద్దె నెక్కిందని, అదో బడా ఝూటా పార్టీ అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేసి గెలిచిండని, ఇప్పుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిండని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఐదు నెలలు గడిచినా వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అనతి కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్, రేవంత్ చెప్పిన అబద్దాలను ప్రజలు గమనించాలని, ఓటుతో బుద్ధి చెప్పేలా చైతన్యవంతులు కావాలన్నారు. మళ్లీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. అలాగే కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నయా పైసా పనైనా చేశాడా? అని ప్రశ్నించారు. ఈ ఐదేండ్లలో చేసింది శూన్యమని, ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేదన్నారు. ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. దేశంలో లౌకిక వాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మతతత్వ పార్టీ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు తీసుకురాని అసమర్థుడు బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు త్వరలో జరగనున్న పార్ల మెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నాడు ఎడారిగా ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అనేక ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేస్తే, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మళ్లీ ఎడారి చేశారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తుంచుకోవాలని, ఆయా పథకాల లబ్ధి పొందిన వారు తమ దగ్గరికి వచ్చే కాంగ్రెస్, బీజేపీలు తమకు ఏమి చేశారో అడిగి నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలో అమలైన పథకాలు, చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు బీఆర్ఎస్ కు, వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని రాజలింగారెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *