సబ్బండ వర్గాల సంక్షేమానికి బిఆర్ఎస్ కృషి: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

దివ్యాంగులను ఆదుకున్నది సీఎం కేసీఆర్…
. సబ్బండ వర్గాల సంక్షేమానికి బిఆర్ఎస్ కృషి
. ఆశీర్వదించండి.. మీకు సేవ అవకాశాన్ని కల్పించండి
. బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్:
దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తూ వారిని ఆదుకున్నది సేమ్ కేసీఆర్ మాత్రమేనని బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కమలాపూర్ లో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన 60 ఏళ్లుగా దివ్యాంగుల సమస్యను పట్టించుకున్న రాజకీయ నాయకులే లేరని, దివ్యాంగుల గురించి ఆలోచించిన ప్రభుత్వం కూడా లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమ కోసం రూ.4 వేల పెన్షన్ చేసిన మహానీయుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దివ్యాంగుల కష్టాలు వర్ణనాతీతం అన్నారు. కేసీఆర్ వచ్చాకే దివ్యాంగులకు బాసటగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులను కడుపులో పెట్టి చూసుకున్నారన్నారు. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా దివ్యాంగులకు ఒక కొడుకుగా ఉండి వారికి అండగా నిలబడతానన్నారు. దివ్యాంగుల కోసం ముఖ్యమంత్రి కొత్త మేనిఫెస్టోలో 4వేల రూపాయల పెన్షన్ ను 6 వేలకు పెంచారన్నారు. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచడం జరుగుతుందన్నారు. సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలందరికీ ప్రతినెల 3వేలు అందిస్తామన్నారు. దీంతోపాటు గ్యాస్ సిలిండర్ ని కూడా కేవలం 400కే అందించనున్నామన్నారు. రైతు బీమా లాగానే కెసిఆర్ ధీమా ఇంటింటికి బీమా అని ఒక పథకం ప్రవేశపెట్టాలని అందులో రేషన్ కార్డుదారులందరికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.