మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ విశేష కృషి: హోంమంత్రి మహమూద్ అలీ

సర్వ మత సౌభ్రాతృత్వానికి నిదర్శనం కేసిఆర్ పాలన
. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ విశేష కృషి
. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి
. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
. మైనార్టీల కోసం 2 కోట్లతో హుస్నాబాద్ లో షాదీ ఖానా:సతీష్ కుమార్

హుస్నాబాద్:
సర్వ మత సౌభ్రాతృత్వానికి నిదర్శనం కేసిఆర్ పాలన రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు నియోజకవర్గ ముస్లిం మైనారిటీలందరు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కేసిఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మైనార్టీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపు, గురుకుల పాఠశాలలు, షాదీ ముబారక్, విదేశాలకు వెళ్లాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు ద్వారా మైనారిటీలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు మైనార్టీలకు చేసింది ఏమీ లేదన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ రెండు పర్యాయాలు వేలకోట్లతో అభివృద్ధి చేశాడు. వారి కుటుంబం తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీకి, కేసిఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిందని సతీష్ కుమార్ తండ్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు సైనికుడిగా, రాజకీయ నాయకునిగా, మానవతావాదిగా ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన వారసునిగా సతీష్ కుమార్ మచ్చలేని నాయకుడు, మంచి మనిషి, నిరంతరం ప్రజాసేవకు అంకితమైన ఆయనను హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ మెజారిటీతో గెలిపించుకోవాలని మెహముద్ అలీ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. 2014 ,2018 లో ఆశీర్వదించారని, 2023లో మూడవసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ముస్లింల షాదీ ఖానా కోసం రెండు కోట్లు కేటాయించానని నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలకు అవసరమైన నిధులు అందించానని సతీష్ కుమార్ వెల్లడించారు.