కేంద్రలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి

0

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి
. 26న సిపిఐ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపాలి
. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

వరంగల్ :
కేంద్రంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం వరంగల్ శివనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం తమ్మెర భవన్ లో సిపిఐ జిల్లా సమితి సమావేశం తాళ్లపెల్లి రహేలా అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ…రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన నిరంకుశ పాలకులను గద్దెదించిన విధంగానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఇంటి సాగనంపాలన్నారు. మోడీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారని, పెట్టుబడి దారీ, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ సంపదను ధారాదత్తం చేశారని ఆరోపించారు. నల్ల ధనం వెలికి తీస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ అవేమీ చేయక పోగా పెద్ద నోట్ల రద్దు పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు.

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి ఉన్న ఉద్యోగులను రోడ్డున పడ వేశారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను విరమించుకోవాలని దేశ రాజధాని డిల్లీలో నెలల తరబడి ఆందోళన చేసిన రైతుల ప్రాణాలను బలిగొన్నారని, పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను హరించేలా కార్మిక చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా మార్చి వేశారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పై నిత్యం వివక్షత చూపిస్తూ అక్కసు వెళ్లగక్కుతున్నారని, అలాంటి మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ని 2024 సార్వత్రిక ఎన్నికలలో సాగనంపాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న సిపిఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలలో వాడవాడలా ఎర్రజెండాలు ఎగురవేయాలని అన్నారు.

ఈ సమావేశంలో వరంగల్ సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాష్ మియా, నాయకులు బుస్సా రవీందర్, గన్నారపు రమేష్, దండు లక్ష్మణ్, అక్కపెల్లి రమేష్, తోట చంద్రకళ, వీరగోని శంకరయ్య, సంగి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *