రేపే బండి సంజయ్ నామినేషన్…

0

రేపే బండి సంజయ్ నామినేషన్…
.హాజరుకానున్న గుజరాత్ సీఎం, కిషన్ రెడ్డి
. ఎస్సారార్ కాలేజీ నుండి భారీ ఎత్తున ర్యాలీకి సిద్ధమైన బీజేపీ శ్రేణులు
. టవర్ సర్కిల్ వద్ద ప్రసంగించనున్న సీఎం, కిషన్ రెడ్డి, బండి సంజయ్
. బండి సంజయ్ సమక్షంలో భారీ ఎత్తున బీజేపీలో చేరికలు
. మానకొండూరు, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్:
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం ఉదయం 11.30 గంటలకు కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని ఎస్సారార్ కాలేజీ నుండి రాజీవ్ చౌక్ మీదుగా టవర్ సర్కిల్ మీదుగా కట్టరాంపూర్, బస్టాండ్, గీతా భవన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. గుజరాత్ సీఎంతోపాటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎస్సారార్ కాలేజీ నుండి ర్యాలీలో పాల్గొంటారు. టవర్ సర్కిల్ వద్ద ర్యాలీని ఉద్దేశించి ఈ ముగ్గురు నేతలు ప్రసంగిస్తారు. అనంతరం గుజరాత్ సీఎం, కిషన్ రెడ్డితో కలిసి జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ ను దాఖలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం బండి సంజయ్ తిరిగి ర్యాలీలో పాల్గొంటారు.
గుజరాత్ సీఎం షెడ్యూల్…
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గురువారం ఉదయం 7 గంటలకు గుజరాత్ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేటకు రానున్నారు. అక్కడి నుండి నేరుగా హెలికాప్టర్ లో 10 గంటలకు కరీంనగర్ లోని స్పోర్ట్స్ స్కూల్ కు చేరుకుంటారు. పార్టీ కరీంనగర్, రాజన్న జిల్లాల అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, మీసాల చంద్రయ్య తదితరులు వీరికి స్వాగతం పలుకుతారు. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి సీఎం ఎస్సారార్ కళాశాల మైదానం వద్దకు చేరుకుంటారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్ లో బండి సంజయ్, కిషన్ రెడ్డితో కలిసి బైక్ ర్యాలీలో రాజీవ్ చౌక్ మీదుగా టవర్ సర్కిల్ వద్దకు చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కరీంనగర్ లోనే మధ్యాహ్నం లంచ్ చేసి 1.30 గంటలకు తిరిగి నాగర్ కర్నూలు వెళతారు. అక్కడ బీజపీ అభ్యర్ధి తరపున నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొని తిరిగి గుజరాత్ వెళతారు..
బీజేపీలో భారీ చేరికలు…
మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు. అందులో భాగంగా ఈరోజను వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోపు బాలరాజు ఆధ్వర్వంలో వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ ఎంపీ కార్యాయలంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మానకొండూర్ మండలం కొండపలకల గ్రామానికి చెందిన బిఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ నల్లగొండ కొమురయ్య, మాజీ వార్డ్ మెంబర్ సైడ్ల పురుషోత్తం, ఆర్ఎంపీ డాక్టర్ ఆరాకాల సంజీవరెడ్డి, ఎగోలపు వెంకన్న గౌడ్, వాసాల భానుచందర్, గట్టు రాజు, ఏరుకొండ లక్ష్మయ్య, భూసారపు రాజయ్య, రంగు శ్రావణ్ కుమార్, తోట రవీందర్, భూసారపు స్వామి, కన్న శ్రీనివాస్, దూలం హరీష్, మడికొండ హర్షవర్ధన్, కాల్వ ప్రశాంత్ యాదవ్, భూసారపు గణేష్ గౌడ్, తోట వినీత్ పటేల్, పైడిమల్ల విజయ్ గౌడ్ గొల్లపల్లి రమేష్, సాయికుమార్, బొమ్మ తిరుపతి, మయోజల సందీప్ కుమార్, గోపగాని రాజుసహా వంద మందికిపైగా నాయకులు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అక్కడి నుండి నేరుగా చొప్పదండికి వెళ్లిన బండి సంజయ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీరాం ముదిరాజ్ సహా ఆ పార్టీకి చెందిన వందలాది మంది నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గుర్రాల వెంకట్ సహా పలువురు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *