ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ పమేలా సత్పతి

జిల్లాలో ఎన్నికల సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
నవంబర్ 30న పోలైన అసెంబ్లీ ఎన్నికల ఓట్లను డిసెంబర్ 3న లెక్కించేందుకు ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్చహించిన ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియలో కౌంటింగ్ పరిశీలకులు సిఆర్ ప్రసన్న, ఎస్ జే చౌడ, మనీష్ కుమార్ లోహన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 ఆదివారం ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరుగుతుందన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని 27 అభ్యర్థులకు చెందిన 390 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ ఓట్లను లెక్కించడానికి 22 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 28 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 22 మంది మైక్రో అబ్సర్వర్ లు, 16 మంది రిజర్వుతో కలుపుకొని మొత్తం 88 మందిని నియమించామన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులకు చెందిన 316 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓట్లను లెక్కించడానికి 68 మందిని నియమించగా అందులో 17 మంది కౌంటింగ్ సూపర్వైజర్ లు, 20 మంది కౌంటింగ్ అసిస్టెంట్ లు,17 మందిమైక్రో అబ్జర్వర్ల తో పాటు 14 మందిని రిజర్వ్ లో ఉంచినట్లు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన 22 మంది అభ్యర్థుల ఓట్ల లెక్కించడానికి 69 మందిని నియమించినట్లు తెలిపారు. 305 పోలింగ్ కేంద్రాలు ఉండగా 17 మంది కౌంటింగ్ సూపర్వైజర్ లు, 20 మంది కౌంటింగ్ అసిస్టెంట్ లు,17 మందిమైక్రో అబ్జర్వర్ల తో పాటు 15 మందిని రిజర్వ్ లో ఉంచామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో 327 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించడానికి 16 మంది కౌంటింగ్ సూపర్వైజర్ లు, 18 మంది కౌంటింగ్ అసిస్టెంట్ లు, 16 మందిమైక్రో అబ్జర్వర్లను 14 మంది రిజర్వ్ తో కలుపుకొని 64 మందిని నియమించినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడం జరుగుతుందని, అనంతరం ఈవీఎంలో పోలైన ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు నియోజక వర్గాల ఆర్వోలు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, కె మహేశ్వర్, రాజు, సిపిఓ కొమురయ్య, డీఐఓ శివరాం, డిటిఓ నాగరాజు, జీఏం ఇండస్ట్రీస్ నవీన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.