హుజురాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం

తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే..
. నా కుటుంబమే ప్రజాసేవకు అంకితం..
. ఆదరించి ఆశీర్వదించండి
. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్:
తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం జమ్మికుంట మండలంలోని శంభునపల్లి, తనుగుల, విలాసాగర్, గండ్రపల్లి గ్రామాలతో పాటు జమ్మికుంట మున్సిపాలిటీలోని 16, 22, 29 వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఎన్నో పేద కుటుంబాల జీవితాల్లో వెలుగు నిండాయన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం కొత్త మేనిఫెస్టోని తయారు చేశారన్నారు. మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకంతో అర్హులైన మహిళలందరికీ నెలకు రూ.3వేలు చొప్పున ఇవ్వనున్నామని, రూ.400 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచనున్నామని, రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కెసిఆర్ ధీమా ఇంటింటా బీమా అనే పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. జమ్మికుంటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ అభివృద్ధి నా బాధ్యత అని అన్న మాట గుర్తు చేశారు.

హుజరాబాద్ ను సిద్దిపేటలా అభివృద్ధి చేస్తా….
గత రెండేళ్లుగా జమ్మికుంట లోని ప్రతి వార్డును అభివృద్ధి చేసుకుందామని, హుజురాబాద్ లో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి వెయ్యి కోట్లు తీసుకువచ్చి హుజరాబాద్ ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకె రాజకీయంలోకి వచ్చానని, నాతోపాటు నా కుటుంబ సభ్యులంతా ప్రజాసేవకే అంకితం అన్నారు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గం ఏం చేస్తాడో చెప్పడం మరిచి నా కుటుంబం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నేను నా కుటుంబం ప్రజల కోసం, ప్రజా సేవ కోసమే ఉంటామన్నారు. నాకు ఓటరు దేవుడితో సమానం అందుకనే దండం పెట్టి అడిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఈసారి హుజురాబాద్ నియోజకవర్గం పై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. నియోజకవర్గ ప్రజలంతా అభివృద్ధి కాంక్షిస్తూ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మిగిలిపోయిన, రోడ్లు కాలువలు, కుల సంఘాల భవనాలతో పాటు అభివృద్ధి చేస్తానని అన్నారు. దీంతోపాటు గృహలక్ష్మి, బిసి లోన్లకు దరఖాస్తులు పెట్టుకున్న వారందరికీ ఎన్నికల అనంతరం ప్రతి ఒక్కరికి దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలతో పాటు బీసీ లోన్ చెక్కులు కూడా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్ పర్సన్ తొక్కలపల్లి రాజేశ్వరరావు, పింగిలి రమేష్, దేశిని కోటి, నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కౌశిక్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండి..
. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సతీమణి షాలిని
గత 15 సంవత్సరాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజాసేవ చేసుకుంటున్నామని ఒకసారి మా కష్టాన్ని కూడా గుర్తించాలని, దండం పెట్టి, కొంగు పట్టి అర్ధిస్తున్న ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు ఇప్పటివరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన గొప్ప ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్ అయినప్పుడు ఇక్కడ వేరే వారిని ఎన్నుకుంటే అభివృద్ధి జరగదని, హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ఉండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. గెలిచిన తర్వాత నీకు ఇచ్చిన హామీలతో పాటు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులన్నీ చేపించే బాధ్యత తీసుకుంటానన్నారు.