6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా..

1

కాంగ్రెస్ నేతలరా… ఎందుకీ డ్రామాలు…?
. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా..
. నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా..?
. బీఆర్ఎస్ ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డ బండి సంజయ్
. సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు
కరీంనగర్:
రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరు పార్టీల నేతల డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగుల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు బండి సవాల్ విసిరారు. ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.. అయినా వాటిని అమలు చేసినట్లు పచ్చి అబద్దాలాడుతున్నరు. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే నేను ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటా… అవసరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమే అన్నారు. నిరూపించకపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుండి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్ తోపాటు తెలంగాణ ఉద్యమకారులు కుమార్ తదితరులు తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయా నేతలతోపాటు మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్ లతో కలిసి మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే సోదరుడు, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కోడూరు మహేందర్ గౌడ్, మెతుకు భాస్కర్, చామనపల్లి సురేందర్ సహా పలువురు పర్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోని అన్ని మతాలు, వర్గాలను సమానంగా చూడాలన్నదే బీజేపీ విధానమని, కానీ బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల టైంలో.. నీ పేపర్ లో కేసీఆర్ నిఖార్సైన హిందువుని నిలువెత్తు బొమ్మ వేయించుకుని ఓట్లడిగినవ కదా… మరి ఆనాడు పంచిన అక్షింతలు ఏమిటి? ఆనాడు నువ్వు పంచిన ప్రసాదమేంది? మీరు కలిపితేనే అక్షింతలు, మీరు పంచిందే ప్రసాదమా? ఇతరులు అదే పని చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. గతంలో హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే కరీంనగరోళ్లు టిఆర్ఎస్ పార్టీని బొందపెట్టరన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొలిటికల్ డ్రామాలాడుతున్నరు.. ఒకాయన పంద్రాగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని అంటుంటే… ఇంకోకాయన సాధ్యం కాదు… రాజీనామా చేస్తానని మీడియాలో బ్రేకింగుల కోసం ఇద్దరూ కలిసి డ్రామాలాడుతూ 6 గ్యారంటీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నరు. ఇప్పుడేమో 6 గ్యారంటీలను అమలు చేశామని అబద్దాలాడుతున్నారన్నారు. మహిళలకు తులం బంగారం, స్కూటీతోపాటు నెలనెలా రూ.2500 బ్యాంకులో జమ చేసినట్లు, ఆసరా పెన్షన్లను రూ. 4వేలు, ఇల్లులేనోళ్లకు జాగా, రూ.5 లక్షలిస్తున్నట్లు, రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇచ్చినట్లు రుజువు చేస్తే పోటీ నుండి తప్పుకునేందుకు నేను సిద్ధమన్నారు. 

1 thought on “6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *