స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

0

యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలి
. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
. వరంగల్ కమిషనరేట్ సి పి అంబర్ కిషోర్ ఝా
హన్మకొండ:
నేటి యువత వివేకానందుని జీవితాన్ని స్ఫూర్తి గా తీసుకొని, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ శిక్త పట్నాయక్ పిలుపునిచ్చారు. నెహ్రు యువ కేంద్ర మరియు వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరియు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) కళాశాల ఆధ్వర్యంలో వివేకానందుని 161 జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని కిట్స్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి అన్వేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశమేనని, యువత యొక్క శక్తి యుక్తులను నైపుణ్యాలను వ్యక్తిగత జీవితానికి సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలన్నారు. ఆశయాలు ఆకాంక్షలతో వినూత్నమైన ఆలోచనలతో రేపటి భవిష్యత్ తరానికి వంతెన లాగా ఉండేది యువత మాత్రమేనన్నారు. సాహసం చేయాలన్న సంస్కరణలు రావాలన్నా అది యువతకు మాత్రమే సాధ్యమని చెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కిషోర్ అంబర్ ఝ మాట్లాడుతూ.. యువత అంటే కేవలం వయసు దృష్టిలో పెట్టుకొని చూడవద్దని, బుద్ధి కుశలత లో చురుకుదనం , ఉప్పొంగే ఉత్సాహం, ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా ఉండగలిగితే యవ్వనంగా ఉన్నట్టేనని హితవు పలికారు. చాలా రోడ్డు ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యమేనని, వాహనాన్ని నడిపేటప్పుడు తప్పనిసరిగా అర్హత పత్రాలు తమ వద్ద ఉంచుకొని, ట్రాఫిక్ సిగ్నల్స్ ను తుచా తప్పకుండా పాటించి మంచి పౌరులుగా ఎదుగుటకు యువత కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపి జితేందర్ రెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ భోజరాజు, కిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె కోమల్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సతీష్ చంద్ర, డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ ప్రొఫెసర్ శంకర్, అసోసియేటెడ్ డీన్ ఎం నరసింహ రావు, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాహిమా సుల్తానా మరియు స్రవంతి ట్రాఫిక్ సి.ఐ. సీత రెడ్డి, జాతీయ యువజన అవార్డు గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *