ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలి

0

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

 

కరీంనగర్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజలలోకి తీసుకెళ్లేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని సమగ్రమైన ప్రణాళికతో, సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కోన్నారు. ఈ నెల16 నుండి 26 జనవరి వరకు చేపట్టనున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర పై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులకు నిర్వహణపై దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…అణగారిన వర్గాలకు సామాజిక భద్రత, ఆయష్మాన్ భారత్, సాధికారతపై మహిళలకు భరోసా, ఆత్మనిర్భర్ భారత్, పియం జన్ దన్, మొదలగు కేంద్ర ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. హమారా సంకల్ప్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో బాగంగా జిల్లాకు 4 ప్రచార వాహనాలను చేరుకున్నాయన్నారు. ఈ నాలుగు వాహనాలు డిసెంబర్ 16 నుండి జనవరి 26, 2024 వరకు ప్రతిరోజు జిల్లాలోని 4 మండలాలో ప్రతి మండలంలో 2 గ్రామాల చోప్పున ప్రచార కార్యకమాలను నిర్వహిస్తాయని పేర్కోన్నారు.

ఈ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ను యంపిడిఓలు, యంపిఓలు వ్రాతపూర్వకంగా రూపొందించి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు లిఖితపూర్వకంగా తెలుపాలని సూచించారు. సంబంధిత శాఖలకు సంబందించిన అవగాహన కార్యక్రమాలలో ఆయా శాఖల అధికారులు హజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా చూడాలన్నారు. గ్రామాలలో విధులను సక్రమంగా నిర్వహించి అద్బుత ప్రగతి కనబరిచిన క్షేత్రస్థాయి సిబ్బందిని గుర్తించి వారిని సన్మానించాలని తెలిపారు. వాహనం గ్రామానికి చేరుకుని తిరిగి వెళ్లే వరకు పంచాయితి సెక్రటరీలు బాధ్యత వహించేలా ఆదేశాలను జారిచేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో వికసిత్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డివో శ్రీలత, ఎల్ డిఎం ఆంజనేయులు, ఎస్బియం కిషన్ స్వౌమి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, డిసిఓ రామానుజాచారి, స్పోర్ట్స్ అధికారి రాజవీర్, నెహుయువ కేంద్రం కో ఆర్డినేటర్ రాంబాబు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, సీఈఓ రమేష్, హార్టికల్చర్ జెడి శ్రీనివాస్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఎన్ఐఓ శివ రాములు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఇతర అధికారులు, యంపిడిఓలు, యంపిఓలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *