జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరణ చేయాలి

0

జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరణ చేయాలి
. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేష్

కరీంనగర్:
తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాలను ప్రాతిపదికగా చేసుకొని నూతన జోనల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాలని నూతన ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా ముఖ్య సమన్వయకర్త మహమ్మద్ ఫయాజ్ అలీ విజ్ఞప్తి చేశారు. 33జిల్లాల విభజనపై జోడిసియరీ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఏర్పాటు చేసే కమిటీ జోనల్ వ్యవస్థ రీ ఆర్గనైజ్ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం చేసిన జోనల్ విభజన అశాస్త్రీయంగా ఉందన్నారు. ఈ అశాస్త్రీయమైన జోనల్ విధానం వల్ల నూతన నియామకాలకు మరియు ఉమ్మడి జిల్లా స్థానికత ప్రాతిపదికన నియామకమైన ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుచున్నదని పేర్కొన్నారు. పాత జిల్లా భౌగోళిక ప్రాంతాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన జోనల్లో కలపడం వల్ల ఉద్యోగుల పదోన్నతులలో నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 ప్రకారం నియామకమైన వారిని వారి తదుపరి పదోన్నతి పోస్ట్ లో పదోన్నతి పొందేందుకు ఉమ్మడి జిల్లాలోని అన్ని పోస్టులకు అర్హత కలిగి ఉండేవారని, జిల్లాల విభజన వల్ల కొత్తగా ఏర్పడిన జిల్లాలోకి అలోకేషియన్ చేయబడినందున ఆ ఒక్క జిల్లాలోనే పదోన్నతి పొందే అర్హత కలుగుతుందని పేర్కొన్నారు. నూతన జిల్లాలకు కేటాయింపబడిన ఉద్యోగులకు పాత జిల్లా భౌగోళిక ప్రాంతం స్థానికత ఆధారంగా నియామకమైనందున పాత జిల్లా భౌగోళిక ప్రాంతంలో ఏర్పడిన నూతన జిల్లాలకు కేటాయింపులు చేశారని, కానీ పదోన్నతులకు పాత జిల్లా భౌగోళిక ప్రాంతం మొత్తంలో ఉన్న పోస్టులకు పదోన్నతి అవకాశం కల్పించకపోవడం శోచనీయమన్నారు. నూతన జిల్లాలకు కేటాయింపబడిన ఉద్యోగులకు పదోన్నతులు ఒక జిల్లాలో జూనియర్ కు వేరే జిల్లాలో సీనియర్ అయినప్పటికీ పదోన్నతి అవకాశం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన నూతన జిల్లాలకు కేటాయింపులు చేశారో అదే ప్రాతిపదికన ఉమ్మడి జిల్లా యూనిటు గా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జోన్లను విభజించి గతంలో ఉమ్మడి జిల్లా క్యాడర్ గా ఉన్న పోస్టును జోనల్ పోస్టుగా రీ ఆర్గనైజ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ నాగేందర్ సింగ్ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ ప్రధాన కార్యదర్శి రామ్ దామోదర్ రావు, జిల్లా కార్యదర్శి తిరుపత చారి కనకయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *