రైతులను మోసం చేసిన పార్టీలకు రైతుల ఓట్లు అడిగే హక్కు లేదు

0

రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు రైతుల ఓట్లు అడిగే హక్కు లేదు
. 12 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసిన బండి సంజయ్ ని గెలిపించండి
. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి
కరీంనగర్:
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు రైతుల ఓట్లు అడిగే హక్కు లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం గంగాధర మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ రైతు సమ్మేళనం పెంచారు ఈ సందర్భంగా హాజరైన శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. డిసెంబర్ కల్లా రైతుకు రెండు లక్షల రుణ మాఫీ, వరి ధాన్యానికి 500 బోనస్, ఎకరాకు 15 వేలు రైతు భరోసా ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో రైతుల భూములను పాస్ బుక్కులో నమోదు చేయని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ
అభ్యర్థులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. దేశంలో అనేక కుంభకోణాలు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కి ఉన్నదన్నారు. వర్షాకాలం పండిన వరి ధాన్యానికి డిసెంబర్ నెలలో 500 బోనస్ ఇస్తామని, రెండు లక్షల రుణ మాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు మొండి చెయ్యి చూపిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి పనులను బండి సంజయ్ ప్రారంభిస్తే వాటిని తాను తెచ్చానని వినోద్ రావు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రైతుల డబ్బులు తిరిగి ఇవ్వాలి…
ధరణి పేరుతో కబ్జాలకు పాల్పడి రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి రైతులకు ఇచ్చాకనే విఆర్ఎస్ నాయకులు ప్రచారానికి రావాలన్నారు. తాలు తరుగు పేరుతో రైతులను దోచుకున్న బందిపోటు దొంగలకు వినోద్ రావు, కేటిఆర్ నాయకులని ఆయన విమర్శించారు. దశాబ్దం పాటు పరిపాలించి రైతులకు ఆన్యాయం చేసి దోచుకున్న బిఆర్ఎస్ నాయకులను గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ కిసాన్ మోర్చా శ్రేణులు గ్రామ గ్రామాన మోడీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలను వివరించాలని కోరారు. నిరంతరం అవినీతిపై పోరాటం చేస్తూ పార్లమెంట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బండి సంజయ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించరా కృషి చేయాలని కిసాన్ మోర్చా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చొప్పదండి ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మూగ జయశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, నాయకులు పెరుక శ్రవణ్, అన్నాడి రాజిరెడ్డి, కృష్ణస్వామి, కోడిపల్లి గోపాల్ రెడ్డి, సత్తు తిరుమల రెడ్డి, కరివేద మహిపాల్ రెడ్డి, మోతే గంగారెడ్డి, చింతపల్లి మోహన్ రావు, వైద రామానుజం, ఉప్పు రాంకిషన్, తుం నారాయణ, కొలా అశోక్, రెండ్ల రాజిరెడ్డి, రేకుల రవీందర్ రెడ్డి, ఒంటెల కరుణాకర్ రెడ్డి, రెండ్ల శ్రీనివాస్, సమ్మిరెడ్డి, సుద్దాల రవీందర్ రెడ్డి, మల్యాల వినయ సాగర్, సత్యనారాయణరెడ్డి, తాళ్ళ రాజశేఖర్, దేశెట్టి శ్రీనివాస్, పెంచల రాములు, ఆకుల మనోహర్, కట్ల శ్రీనివాస్, రాజిరెడ్డి, గుర్రం కమలాకర్ రెడ్డి, దాసరి ఆంజనేయులు, కరుణాకర్, పేరుక మహేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *