మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం..

0

మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం..
. కాల్వలో నుంచి తోడిన చెత్తను రోడ్డుపైనే పడేస్తున్న వైనం
. ఇబ్బంది పడుతున్న కాంప్లెక్స్ వాసులు

హుజురాబాద్
హుజరాబాద్ మున్సిపాలిటీని సమస్యలు వెంటాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో మున్సిపల్ సేవలు సరిగా అందడం లేదు. ఏడాదికి కోట్లలో ఆదాయం వస్తోన్నా.. జనాలకు అందాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. డ్రైనేజీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానిక జనం చెబుతున్నారు.

పెద్ద షాపింగ్ ఏరియా కాంప్లెక్స్…
హుజరాబాద్ పట్టణంలో పెద్ద షాపింగ్ ఏరియా డీసీఎంఎస్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ లోనే ప్రధాన బ్యాంకులతోపాటు వాణిజ, వ్యాపార సముదాయాలు ఉంటాయి. కాగా ఈ ఏరియాలో సరైన డ్రైనేజీ లేక మురుగునీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాంప్లెక్స్ వాసులు చెబుతున్నారు. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను సిబ్బంది రోడ్లమీద పడేయడంతో దుకాణాల ముందు అపరిశుభ్ర వాతావరణం నెలకొంటున్నదని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై చెత్త చెదారం వేయడంతో గాలికి వాహనదారులపై పడుతున్నాయని పేర్కొన్నారు. తరచుగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది చెత్తను వెంటనే తొలగించేలా చూడాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *