అభివృద్ధిలో కరీంనగర్ ముందంజ..

0

పట్టణ, గ్రామీణాభివృద్దిలో అగ్రభాగాన నిలుస్తున్న కరీంనగర్
. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి
కరీంనగర్:
మౌళిక వసతుల కల్పనతో పట్టణ, గ్రామీణాభివృద్దిలో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కోన్నారు.గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో 32మంది కేంద్ర ప్రభుత్వ మిలటరి ఇంజనీరింగ్ సర్వీస్ శిక్షణ అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ శిక్షణ అధికారులు జనవరి 20 నుండి 25 వరకు కరీంనగర్ జిల్లా గ్రామ సందర్శనను ముగించుకొన్న సందర్బంగా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ జిల్లాలో శిక్షణ తీసుకోవడం ఎంతో ఉపయోగపడుతుందని, ఇక్కడ అనేక వనరులు ఉన్నాయని తెలిపారు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉంటూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల అవసరాల కనుగునంగా అభివృద్ది పనులను చేపడుతూ కరీంనగర్ జిల్లా అగ్రబాగాన నిలుస్తుందని తెలిపారు. ఆహారం, మంచినీరు, ప్రకృతివనాలు మరియు వైకుoఠదామాలు మొదలగు పనులతో అభివృద్దిని సాధించిందని వివరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 32 శిక్షణార్ధులు మాట్లాడుతూ.. జిల్లాలోని నాగులమల్యాల, రుక్మాపూర్, వెలిచాల, మదురానగర్, మరియు అన్నారం గ్రామాల్లో పర్యటించడం జరిగిందని, గ్రామంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో మంచి మార్పులను తీసుకువచ్చారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జడ్పి సిఈఓ పవన్ కుమార్, ఆర్.టి.యం శ్రీనివాస్, 32మంది శిక్షణ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *