భూ బకాసురుల నుండి కరీంనగర్ ను రక్షించాలి

1

ప్రభుత్వ భూములను కాపాడాలి..
. భూ బకాసురుల నుండి కరీంనగర్ ను రక్షించాలి
. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బిజెపి నాయకులు నిరసన

కరీంనగర్:
కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో అన్యాక్రాంతమవుతు, కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టరేట్ ముందు భూ బకాసురుల నుండి కరీంనగర్ రక్షించాలి ప్రభుత్వ భూములను కాపాడాలంటూ బిజెపి శ్రేణులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ… కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని తీగల గుట్టపల్లి, బొమ్మకల్, కొత్తపల్లి, బావు పేట, ఎలగందులతో పాటు పట్టణంలోని అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతూ కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. లోగడ బిఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతో బిఆర్ఎస్ నేతలు కొందరు కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేశారనన్నారు. భూ కబ్జాలకు పాల్పడిన బిఆర్ఎస్ నేతల పట్ల ప్రభుత్వం ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తుందని ప్రశ్నించారు. ప్రధానంగా సీతారాంపూర్ లోని 71 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అంశం వివాదాస్పదంగా మారిన నేటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా అలసత్వం విడాలని, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను రక్షించడానికి , భూ బకాసురుల నుండి కరీంనగర్ ను కాపాడడానికి తగిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, జానపట్ల స్వామి, సుధాకర్ పటేల్, ఎడమ సత్యనారాయణ రెడ్డి, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, కార్పొరేటర్లు పెద్దపల్లి జితేందర్, కోలగాని శ్రీనివాస్, దురిశెట్టి అనుప్, చొప్పరి జయశ్రీ, నాగసముద్రం ప్రవీణ్, బండ రమణారెడ్డి, ఎన్నం ప్రకాష్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పాదం శివరాజ్, పురం హరి, లడ్డు ముందడ, శ్రీనివాస్, అనిల్, బల్బీర్ సింగ్, రమణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

1 thought on “భూ బకాసురుల నుండి కరీంనగర్ ను రక్షించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *