బాలికలకు అవగాహన కల్పించాలి

0

సురక్షిత బాల్యం కోసం అందరు కృషిచేయాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
పిల్లలపై జరుగుతున్న హింసలను తగ్గిస్తూ వారికి సరైన అవగాహనను కల్పిస్తూ సురక్షిత బాల్యాన్ని అందించడానికి అందరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన స్నేహిత ఫస్ట్ వన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..పిల్లలపై జరుగుతున్న హింసను తగ్గించి వారికి అన్ని అంశాలపై అవగాహన కల్పించడానికి వివిధ శాఖల అధికారులతో మహిళా శిశు సంక్షేమ, విద్య, వైద్య, డిఆర్డిఏ, పంచాయితి, పోలీస్ శాఖల వారిగా బృందాలను ఏర్పాటు చేసి 110 పాఠశాలలోని పిల్లల కొరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమాన్ని పకడ్బందిగా నిర్వహించాలని, పిల్లలందరు దైర్యంగా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెప్పుకునే విధంగా స్నేహితులుగా ఉండాలన్నారు. వారి బాషలో అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని, పిల్లలకు ఇబ్బంది ఉన్నప్పుడు దైర్యంగా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత నెంబరుకు ఫోన్ చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. సేఫ్ టచ్ మరియు అన్ సేఫ్ టచ్, సురక్షితమైన ఇంటర్ నెట్ వినియోగం, సెల్ఫ్ ప్రోటెక్షన్ మరియు పిల్లలో డ్రగ్ నివారణ, విద్యయొక్క ప్రాముఖ్యత, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి చైర్పర్సన ధనలక్ష్మీ, డిడబ్ల్యుఓ సరస్వతి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, మార్కేటింగ్ అధికారి పద్మావతి, ప్రోగ్రాం అధికారి డేవిడ్ రాజు, జిల్లావైద్యాధికారి లలితాదేవి, డిఆర్డిఓ శ్రీలత, డిసిపిఓ శాంత, సఖీ అధికారి లక్ష్మీ,1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్, డిడబ్ల్యుఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *