డేటా ఎంట్రీ ఏర్పాట్లు పూర్తి చేయాలి

0

ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ఏర్పాట్లు పూర్తి చేయాలి
. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్

కరీంనగర్:
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రికి ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మహలక్ష్మీ, రైతు భరోసా, గృహలక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వివిధ కుటుంబ వివరాల డేటా ఎంట్రీ పై డిటియం, డిపియం, మున్సిపాలిటి జూనియర్ అసిస్టెంట్ లు మరియు కంప్యూటర్ ఆపరేటర్ లకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 06, 2024 వరకు తీసుకోబడిన దరఖాస్తులను మరియు వాటి వివరాలను వెబ్ సైట్ లో నమోదు చేయుటకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇందు కోసం సిబ్బందికి శిక్షణ అందించడం జరుగుతుందని, శిక్షణ అనంతరం సిబ్బందిని రెండు బృందాలుగా చేసి రోజుకు రెండు షిప్టుల వారీగా నమోదు ప్రక్రియను చేపట్టడం జరుగుతుందన్నారు. ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా డాటా ఎంట్రీ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సిపిఓ కొమురయ్య, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *