యశోద’లో మహిళ గుండెకు ఆపరేషన్ లేకుండా అరుదైన చికిత్స

0

యశోద’లో మహిళ గుండెకు ఆపరేషన్ లేకుండా అరుదైన చికిత్స
. ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండె ప్రమాదాలను నివారించవచ్చు
. అందుబాటులో ఆపరేషన్ లేకుండా అధునాతన చికిత్సలు
. సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కుచులకంటి ప్రమోద్ కుమార్
కరీంనగర్:
హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స చేసి, ఓ మహిళకు కొత్త జీవితాన్ని అందించినట్లు సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కుచుల కంటి ప్రమోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లోని యశోద హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరిఖనికి చెందిన నరెడ్ల సుజాత, ఏడాదికాలంగా దగ్గుతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో 8 నెలల క్రితం సోమాజిగూడలోని తమ ఆస్పత్రికి వచ్చిందన్నారు. ఆమెకు పరీక్షలు నిర్వహించగా గుండెకు ఆయోటా సంబంధించిన పైప్ ఉబ్బిపోయి బాధపడుతుందని తెలిసిందన్నారు. ఆమెకు అధునాతన చికిత్స ద్వారా అయోటిక్ స్టంట్ వేసి ఆమె ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. ఆపరేషన్ లేకుండా గుండె వాల్వులను కూడా రిప్లేస్మెంట్ చేస్తున్నామన్నారు. ఇటీవల కార్డియాక్ అరెస్టుల సంఖ్య పెరుగుతుందన్నారు. దీనికి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో పాటు, ధూమపానం మద్యపానం ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడమని పేర్కొన్నారు. వైద్య విధానంలో అడ్వాన్సుడ్ పరీక్షలతో పాటు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. యశోదలో కార్డియాలజీ టీం ఉందని ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని, రోగులకు నాణ్యమైన చికిత్సను అందిస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. ఏ హాస్పిటల్లో నైతే ఎక్కువ సంఖ్యలో రోగులకు చికిత్సలను అందిస్తారో ఆ హాస్పిటల్ లో చికిత్స తీసుకోవడం ద్వారా విజయవంతమైన ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. తాము అందించిన చికిత్స ద్వారా సుజాత పూర్తిగా కోలుకొని, 8 నెలలుగా ఆరోగ్యంగా జీవిస్తోందన్నారు. గుండె వైఫల్యం అనేది అతికొద్ది మందిలో మాత్రమే వస్తుందని, అప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. అన్ని రకాల వైద్యులు, అధునాతన వైద్య సదుపాయాలు యశోద ఆస్పత్రిలో ఉండటం వల్లే ఇలాంటి ఆపరేషన్లు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. ముప్పై సంవత్సరాలు దాటిన వారు సిటీ కరొనరి యాంజియోగ్రామ్ చేసుకుంటే ఐదేళ్లు వరకు హ్యాపీగా జీవించవచ్చన్నారు.
అనంతరం సుజాత మాట్లాడుతూ...తాను బతుకుతానని అనుకోలేదని, యశోద ఆస్పత్రి వైద్యులు అందించిన అధునాతన వైద్యంతో ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడపడం సంతోషంగా ఉందన్నారు. గోదావరిఖని, కరీంనగర్, హైదరాబాద్ ఇలా పలుచోట్ల ఎన్నో ఆసుపత్రులను మూడు నెలపాటు తిరిగిన కూడా ఎవరు సరైన పరిష్కారం అందించకపోగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని 25 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. యశోద ఆసుపత్రిలో ఆపరేషన్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చులో చేశారు. తనకు యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మను అందించారని డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *