పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి

0

డ్రాప్ అవుట్ లేకుండా చూడాలి..
. ప్రగతి తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి
. ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలి
. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
పాఠశాలల్లో డ్రాప్ అవుట్ విద్యార్థులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యాశాఖ అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో డీఈవో, ఎంఈఓ విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ విద్యార్థులు లేకుండా కృషి చేయాలన్నారు. ప్రతి నెల మూడవ శనివారం జరిగే ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశంలో ప్రగతి తక్కువ ఉన్న పిల్లలపై వ్యక్తిగతంగా శ్రద్ధ చూపెట్టాలని ఆయా గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు అందరినీ సమావేశానికి ఆహ్వానించాలన్నారు. సమావేశంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రదర్శన చేయాలన్నారు. బుధవారం బోధన అనే కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహించాలని, పిల్లల నమోదు తక్కువగా ఉన్న పాఠశాలల్లో నమోదు పెంచాలన్నారు. రాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి సిహెచ్ జనార్ధన్ రావు, మండల విద్యాధికారులు, క్వాలిటీ కోఆర్డినేటర్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్, జిల్లా సైన్స్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *