శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవాలి

0

శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవాలి
. మానవికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య
హుజురాబాద్:
విద్యార్థులు విద్యతో పాటు శాస్త్రీయ అవగాహనను పెంపొందించుకోవాలని మానవికాస వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య సూచించారు. బుధవారం స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల (వీణవంక)లో మానవ వికాస వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ ఆలోచనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో మ్యాజిక్ లెక్చరర్ గా పనిచేస్తున్న ఇ. చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చంద్రయ్య విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు మ్యాజికులు, మ్యాథమెటిక్స్ గారడీ లాంటి సన్నివేశాలు నిర్వహించి విద్యార్థులను అబ్బురపరిచారు. ప్రస్తుత సమాజంలో సైన్స్ ప్రాముఖ్యత చాలా ఉందని, అందుకు ప్రతి ఒక్కరు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గడల శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రిన్సిపల్ నరేష్, మానవికాస వేదిక హనుమకొండ జిల్లా అధ్యక్షులు పెరుక సుందరయ్య, కరీంనగర్ జిల్లా కన్వీనర్ కలకోటి వెంకటేష్, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు సత్తిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు సురేష్, సుమలత, శ్రీనాథ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *