పిల్లలను బడిలో చేర్పించాలి

0

బడీడు పిల్లలను పనులకు దూరంగా ఉంచాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
బడికి వెళ్లాల్సిన పిల్లలను కూలీ పనులలో ఉండకూడదని, వారికి తిరిగి బడులకు పంపించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆపరేషన్ స్మైల్ పై జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..తప్పిపోయిన పిల్లల కొరకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కోన్నారు. ఈ సంవత్సరం కూడా జనవరి 1 నుండి 31 వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్, లేబర్, విద్యాశాఖ, రెవెన్యూ ఇతర శాఖల సమన్వయంతో బృందాలుగా ఏర్పడి 18 సంవత్సరాల లోపు పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందన్నారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించే విధంగా చూడాలన్నారు. పిల్లలకు ఏదైనా ఆపద ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 ఫోన్ చేస్తే సంబంధించిన అధికారులు వచ్చి సహాయం అందిస్తారని తెలిపారు. 15 నుండి 18 సంవత్సరాల పిల్లలను పనిలో నియమించినట్లయితే రిస్కు చేయాలని, హోటల్, రైస్ మిల్లులు, ఇటుక బట్టీలు, గ్రానైట్ క్వారీలు, షాపులు మొదలైనవన్నీ సందర్శించి, నిర్వహకులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ఇంత వరకు రక్షించిన పిల్లలందరు పాఠశాలకు వెళ్తున్నారా లేదా చూడాలని తెలిపారు. అనంతరం ఆపరేషన్ స్మైల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూవో సరస్వతి, ఆర్డివో మహేశ్వర్, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, సిడబ్ల్యుసి చైర్మన్ ధనలక్ష్మి, పరిశ్రమల శాఖ అధికారి నవీన్, లేబర్ కమిషనర్ సామిల్, డిసిపిఓ శాంత, సిహెచ్ఎల్ సంపత్, సఖీ అధికారి లక్ష్మీ, ఎస్సై అన్వర్, సిడిపిఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *