చెట్లతోనే మానవ మనుగడ..

2

మొక్కలు నాటేందుకు కాలంతో పనిలేదు
. డిప్యూటీ కలెక్టర్ వై. వి. గణేష్

 

హనుమకొండ:
మొక్కలు నాటేందుకు కాలంతో పనిలేదని, నాటిన మొక్కలను కాపాడాలనే ఆలోచన ఉండాలని హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ వైవి గణేష్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్) సంస్థ వరంగల్ బాధ్యులు శుక్రవారం హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ ( ఆర్డీవో) వై. వి. గణేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గతంలో మధిర, చర్ల, ఖమ్మం మొదలగు ప్రదేశాల్లో గ్రీన్ భద్రాద్రి అనే హరిత స్వచ్ఛంద సంస్థను స్థాపించి తద్వారా ఏన్నో వేల మొక్కలు నాటించినని, అవి పెద్ద వృక్షాలుగా ఎదిగి ఉన్నాయని ఆర్డీవో తెలిపారు. తన వంతు సహకారాన్ని యుఎఫ్ఈపి కి అందిస్తానని హామీ ఇచ్చారు. మొక్కలు నాటుటకు కాలంతో సంబంధం లేదని, నీరు ఇవ్వగలిగితే 2 మీ.పై బడిన ఎత్తైన మొక్కలు మాత్రమే నాటాలని తెలిపారు. పట్టణంలో ఖాళీ స్థలాలు, కాలనీలు గుర్తించాలని కోరారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటితే ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాగే ఇనుపరాతి గట్టు అటవీ ప్రాంతాన్ని రక్షిత అడవిగా ప్రకటించి కాపాడే ప్రయత్నం చేద్దామన్నారు. పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక బాధ్యులు డిప్యూటీ కలెక్టర్ కు వృక్ష ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా యుఎఫ్ఈపి బాధ్యులు అధ్యక్షులు కాజీపేట పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి టీ. శ్రవణ్ కుమార్, న్యాయ సలహాదారు పొట్లపల్లి వీరభద్ర రావు, కార్యవర్గ సభ్యులు వాకులాభరణం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ పిట్టల రవి బాబు లు పాల్గొన్నారు.

 

 

2 thoughts on “చెట్లతోనే మానవ మనుగడ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *