బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలి

0

ప్రభుత్వ పాఠశాలల్లో సాధికారత కమిటీలను ఏర్పాటు చేయాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
బాలిక సాధికారత దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలిక సాధికారత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాల విద్యార్థులు, సంక్షేమ శాఖ అధికారులతో మహిళా సాధికారతపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. ఆడపిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దుటకు మంచి వినోద భరితమైన వాతావరణంలో విద్యతో పాటు ఉన్నత విలువలను నేర్పాలన్నారు. మంచి పౌరులుగా ఎదగడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం చేతులు కలపాలని సూచించారు. బాలికా సాధికారత కమిటీలను ఏర్పాటు చేసి బాల్యవివాహాలు, లైంగిక దాడులు, లింగవివక్షత ఆరోగ్య సమస్యలు వంటివాటిని దైర్యంగా ఎదుర్కోనేలా అవగాహనలు కల్పించాలని పేర్కొన్నారు. ఆడపిల్లలు కేవలం ఇంజనీర్, డాక్టర్లు గా మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు. కార్యక్రమంలో చివరగా స్నేహితా బ్యాడ్జీలను పిల్లలకు, మహిళా ఉద్యోగులకు కలెక్టర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, డిఆర్డివో శ్రీలత, జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, సఖీ సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మీ, డిసిడిఓ కృపారాణి, సిబ్బంది, కేజీబీవీ విద్యార్థులు, స్కూల్ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *