మాతృ మరణాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలి

0

మాతృ మరణాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
మాతృ మరణాలు సంభవించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…మాతృ మరణాలు జరగకుండా ఉండుటకు ప్రతి గర్భిణీ స్త్రీ యొక్క రికార్డు ఎంసిపి కార్డులో పూర్తి చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి బర్త్ ప్లానింగ్ ఎక్కడ చేయాలో తగు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అట్టి గర్భిణీ స్త్రీ తో ఆశా వర్కర్ గాని ఏఎన్ఎం గాని వెంట ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని రెఫరల్ సెంటర్లో గానీ దగ్గర ఉండి పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. హై రిస్క్ కేసులను గుర్తించి తప్పకుండా వైద్యాధికారులచే సంబంధిత క్లినిక్ లో స్త్రీవైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించాలన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి రెఫరల్ అయినటువంటి గర్భిణీ కేసులకి తక్షణ వైద్య సదుపాయాలను పూర్తిస్థాయిలో జరగడానికి అనుకూలంగా ఉండేందుకు మాతా శిశు సంరక్షణ కేంద్రం కరీంనగర్ లో ఒక సమన్వయ అధికారిని నియామకం చేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, పిఓ ఎంసిహెచ్ డాక్టర్ జవేరియా, అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, డాక్టర్ చందు, జిల్లా ఇమ్యూనియేషన్ అధికారి డాక్టర్ సాజిద, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, డెమో రంగారెడ్డి ఇతర వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *