శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు

ఫిర్యాదుల పై తక్షణమే స్పందిస్తాం..
. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా
హన్మకొండ:
శాంతి భద్రతలు లేదా ఇతరత్రా ఎదైన సమస్యలపై ఫిర్యాదులు చేస్తే తక్షణమే స్పందించడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ప్రజలకు సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతి భద్రత పరిరక్షణకై తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు పోలీస్‌ కమిషనర్‌కు మరింత సులువుగా తమ ఫిర్యాదులను అందజేసేందుకు ప్రత్యేక చర్యలు గైకోనడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములోని సెంట్రల్‌ కంప్లయింట్‌ సెల్‌ విభాగంలో అందజేయాల్సి వుంటుందన్నారు. ఆలాగే ఫిర్యాదుదారులు 8712685061, 8712685070 నంబర్లకు ఫోన్‌ ద్వారా గాని లేదా వాట్సప్‌, cccwarangal99@gmail.com మెయిల్‌ ద్వారా కుడా తమ ఫిర్యాదులను అందజేయవచ్చని తెలిపారు. ఈ విభాగానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీస్‌ అధికారులకు పంపించి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే తగు చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికను రూపోందించడం జరిగిందన్నారు. అలాగే వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు వ్యక్తిగతంగా తమ ఫిర్యాదులను అందజేయాలనుకునే వారు ఫిర్యాదులను అన్ని ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం ఒంటి గంటలోపు తమ ఫిర్యాదులను అందజేయాల్సి వుంటుందన్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు ప్రత్యక్షంగా అందజేసే ఫిర్యాదులు ముందుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసి వుండాలని పోలీస్‌ కమిషనర్‌ ఒక ప్రకటన తెలపారు.