పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం పెంచాలి

0

అధికారులు విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
. పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం పెంచాలి
. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియాదర్శిని

మెదక్:
జిల్లాలో పోలీసు అధికారులు తమ విధులపై పూర్తి అహవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియాదర్శిని సూచించారు. శుక్రవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జిల్లాలోని పోలీసు సిబ్బందితో నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులలో విచారణ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఏఏ అంశాలు క్రోడికరించాలనే తదితర అంశాల పై జిల్లా ఎస్పీ వివరించారు. చలికాలంలో దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉన్నందున ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కనిపించాలన్నారు. రోడ్డు నియమాలు పాటించనివారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యం సేవించి వాహనాలు నడపితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా నంబర్ లేని వాహన గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీసు అధికారికి పూర్తి స్థాయి స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలన్నారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చెదించాలని, కేసుల చెదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలన్నారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్ విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి తరచుగా శిక్షణ తరగతులు నిర్వహించి వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు జిల్లా ఎస్పీ రోహిణి సూచించారు. నాన్ బేయిలబుల్ వారెంట్ త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలన్నారు. సిసి కెమెరా లు పనిచేసే విధంగా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సందేపోగు మహేందర్, తూప్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ.దిలీప్ కుమార్, సిఐ.ప్రకాష్ గౌడ్, సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *